'SSMB 28' సినిమా గురించి ఆసక్తికర అప్డేట్... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో మహేష్ బాబు (Mahesh Babu)..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'SSMB 28' వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం' అనేది సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' అనే మరో టైటిల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో ఇదివరకే 'అతడు', 'ఖలేజా' సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. మరోవైపు.. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, వీరిద్దరూ కలిసి ఇది వరకు 'మహర్షి' మూవీలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.
తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన ఆప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నారట. అలాగే సాఫ్ట్ వేరే ఆఫిస్ లో మహేష్ కు టీమ్ లీడర్ గా పూజ హెగ్డే కనిపించనుందిట. వీరిద్దరి మధ్య జరిగే సీన్స్ కు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా 'పెళ్ళిసందD' బ్యూటీ శ్రీలీల (Sree Leela) నటిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Read More: కూతురు సితార (Sitara) కు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) డాటర్స్ డే శుభాకాంక్షలు.. ఫొటో వైరల్!