మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరా దేవి దశదినకర్మ.. పరామర్శించిన బాలకృష్ణ (Nandamuri Balakrishna)!

Updated on Oct 09, 2022 08:31 PM IST
నేడు ఇందిరా దేవి (Mahesh Babu Mother Indiramma) దశదిన కర్మను నిర్వహించారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆమెకు శ్రద్దాంజలి ఘటించారు.
నేడు ఇందిరా దేవి (Mahesh Babu Mother Indiramma) దశదిన కర్మను నిర్వహించారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆమెకు శ్రద్దాంజలి ఘటించారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తల్లి ఇందిరా దేవి ఇటీవల (సెప్టెంబర్ 28న) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇందిరాదేవి మరణ వార్త తెలియగానే టాలీవుడ్ నుండి చాలామంది వ్యక్తిగతంగా వచ్చి, మహేష్ బాబుకి (Mahesh Babu), కృష్ణకి తమ సంతాపం వ్యక్త పరిచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికాయానికి నివాళులు అర్పించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.

కాగా, నేడు ఇందిరా దేవి (Mahesh Babu Mother Indiramma) దశదిన కర్మను నిర్వహించారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇందిరా దేవికి శ్రద్దాంజలి ఘటించారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా కూడా మహేష్ బాబు ఇంటికి క్యూ కట్టారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సీ కళ్యాణ్‌, కేఎల్ నారాయణ, బండ్ల గణేష్ ఇలా అందరూ ఇందిరా దేవికి నివాళి అర్పించారు. నందమూరి బాలకృష్ణ కూడా ఇందిరా దేవికి శ్రద్దాంజలి ఘటించారు. 

ఇందిరా దేవి మరణించిన రోజు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విదేశాల్లో ఉన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన... ఈ రోజు మహేష్ బాబు, ఇతర ఘట్టమనేని కుటుంబ సభ్యులను ప్రత్యేక్షంగా కలిశారు.

సూపర్ స్టార్ కృష్ణకు (Hero Krishna) ఇద్దరు భార్యలు అన్న సంగతి తెలిసిందే. ఇందిరాదేవి మొదటి భార్య కాగా.. ఈ దంపతులకు మహేష్ బాబు (Mahesh Babu), రమేష్ సహా ఐదుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. విజయ నిర్మలను (Vijay Nirmala) రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే, ఇద్దరు భార్యలు ఉన్నా సంసారంలో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ముందుకెళ్లారట కృష్ణ.

Read More: మ‌హేష్ బాబు (Mahesh Babu) త‌ల్లి ఇందిరా దేవికి సినీ ప్రముఖుల నివాళి !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!