త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మహేష్ బాబు (Mahesh Babu) సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru vari Paata)!

Updated on Sep 12, 2022 07:00 PM IST
'సర్కారు వారి పాట' (Sarkaru vari Paata) మూవీ కొన్ని రోజుల క్రితం నుండే 'ఓటీటీ' ఫ్లాట్ ఫామ్‌లో  కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
'సర్కారు వారి పాట' (Sarkaru vari Paata) మూవీ కొన్ని రోజుల క్రితం నుండే 'ఓటీటీ' ఫ్లాట్ ఫామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా 'సర్కారు వారి పాట'. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 

ఇందులో సముద్రఖని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా, ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ (SS Thaman) సంగీతాన్ని అందించాడు. తమన్ ఈ మూవీకి అందించిన సంగీతం కూడా, ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. అలాగే  మంచి వసూళ్లను కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది.

ఇక, బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న 'సర్కారు వారి పాట' (Sarkaru vari Paata) సినిమా కొన్ని రోజుల క్రితం నుండే 'ఓటీటీ' ఫ్లాట్ ఫామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా మంచి ఆదరణను తెచ్చుకుంది.

అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా (Television Premiere) బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. త్వరలో స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

'సర్కారు వారి పాట' (Sarkaru vari Paata) సినిమాను 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మించారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, తనికెళ్ళ భరణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

Read More: Mahesh Babu: కోరమీసం, గడ్డంతో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ వైరల్.. త్రివిక్రమ్(Trivikram) సినిమా కోసమేనా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!