‘ఏమాయ చేసావే’లో నాగచైతన్య (Naga Chaitanya) ఫస్ట్ ఛాయిస్ కాదంట... దర్శకుడు గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Updated on Sep 20, 2022 11:20 AM IST
‘ఏమాయ చేసావే’ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ (Goutham Menon) ముందుగా సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబుతో (Mahesh Babu) తెరకెక్కించాలని అనుకునుకున్నారట‌.
‘ఏమాయ చేసావే’ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ (Goutham Menon) ముందుగా సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబుతో (Mahesh Babu) తెరకెక్కించాలని అనుకునుకున్నారట‌.

క్రేజీ డైరెక్టర్ గౌతమ్‌ మీనన్‌ (Goutham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave) సినిమా వెండి తెరపై ఎలాంటి మ్యాజిక్‌ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘మ‌ణిర‌త్నం’ సినిమాల త‌ర్వాత.. ఆ స్థాయి ప్రేమ‌క‌థ‌ల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్‌. 

నాగచైతన్య – సమంత (Naga Cahitanya-Samantha) ఈ సినిమా సెట్స్‌లోనే ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. 

కాగా, ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave) సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ క్లాసిక‌ల్ ల‌వ్‌స్టోరీస్‌లో ఈ చిత్రం ఒక‌టి.  నాగార్జున‌కు (Nagarjuna) కెరీర్‌లో ‘గీతాంజ‌లి’ ఎలాంటి మైలురాయిగా నిలిచిపోయిందో.. నాగ‌చైత‌న్య‌కు ‘ఏమాయ చేసావే’ కూడా అలాంటి అనుభూతినే మిగులుస్తుందని పలువురు క్రిటిక్స్ ఆర్టికల్స్ వ్రాశారు . ఈ సినిమా వ‌చ్చి 12 ఏళ్ళు అవుతున్నా.. ఇప్ప‌టికీ కొత్త సినిమా చూస్తున్న ఫీలింగే వ‌స్తుంది. మరోవైపు, ఈ సినిమాలో సుధీర్‌బాబు ఓ చిన్న పాత్రలో కనిపించారు. 

నాగచైతన్య-సమంత నటించిన ఏ మాయ చేసావే సినిమా పోస్టర్ (Naga Chaitanya-Samantha Starrer Ye Maya Chesave Poster)

ఇక ‘ఏమాయ చేసావే’ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ (Goutham Menon) ముందుగా సూపర్ స్టార్ మ‌హేష్‌ బాబుతో (Mahesh Babu) తెరకెక్కించాలని అనుకునుకున్నారట‌. అంతేకాకుండా, మ‌హేష్‌కు ఈ క‌థ కూడా వినిపించాడ‌ట‌. కానీ ఆ సమయంలో మ‌హేష్ ల‌వ్ స్టోరీల‌ను చేయ‌డానికి సిద్ధంగా లేడ‌ని.. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్ష‌న్ క‌థ‌ను రెడీ చేయ‌మని చెప్పాడ‌ట‌. దాంతో అలా ‘ఏమాయ చేశావే’ మూవీ తెలుగులో నాగ‌చైత‌న్య, అలాగే తమిళంలో శింబు ద‌గ్గ‌రికి వెళ్లింది.

తాజాగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ (Goutham Menon) ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఒకే రంగానికి చెందిన వాళ్లు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అని గౌతమ్‌ని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడానికి, లేదా విడిపోవడానికి రూల్స్‌ అంటూ ఏమీ లేవు. ఏదైనా రిలేషన్‌లో ఇబ్బందులు తలెత్తినప్పుడు, వాటిని పరిష్కరించుకునేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. ఒకే రంగానికి చెందిన వాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండాలని, ఉండకూడదని ఏమీ లేదు. ఎందుకంటే, రెండు మనసులు కలిస్తే చాలు’ అని గౌతమ్‌ చెప్పుకొచ్చారు. 

Read More: స్టార్ హీరోయిన్ సమంత (Samantha), సింగర్ చిన్మయి శ్రీపాదకు (Chinmayi Sripada) చెడిందా.. ఆసక్తికర విషయాలివే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!