స్టార్ హీరోయిన్ సమంత (Samantha), సింగర్ చిన్మయి శ్రీపాదకు (Chinmayi Sripada) చెడిందా.. ఆసక్తికర విషయాలివే..!

Updated on Sep 03, 2022 07:56 PM IST
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి (Chinmayi Sripada).. సమంతతో (Samantha) వచ్చిన గ్యాప్‌కి సంబంధించిన విషయాలను వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి (Chinmayi Sripada).. సమంతతో (Samantha) వచ్చిన గ్యాప్‌కి సంబంధించిన విషయాలను వెల్లడించింది.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'ఏమాయ చేసావె' సినిమా ఇద్దరికి లైఫ్ ఇచ్చింది. అందులో ఒకరు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కాగా.. మరొకరు సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada). సమంత ఆ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని ఆకట్టుకుంది. ఆమె పోషించిన జెస్సీ పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండి పోయింది. అయితే, ఇందుకు కారణం ఆమె నటన, గొంతు. ఈ వాయిస్​ అందించింది సింగర్​ చిన్మయి.

'ఏం మాయ చేసావే' (Ye Maaya Chesave) నుంచి ఇప్పటి వరకు సమంత పాత్రకి చిన్మయినే డబ్బింగ్‌ చెబుతూ వస్తోంది. సమంత వాయిస్‌ తో చిన్మయి కూడా బాగానే పాపులర్‌ అయ్యింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. బయట కూడా చాలాసార్లే కలిసి కనిపించారు. అయితే సామ్, చిన్మయికి చెడిందని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై చిన్మయి స్పందించారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి (Chinmayi Sripada).. సమంతతో వచ్చిన గ్యాప్‌కి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. సమంత చాలా మంచి వ్యక్తి అని, తెలుగులో తనకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గా కెరీర్‌ వచ్చిందంటే అది సమంత వల్లే అని చెప్పుకొచ్చింది. 

ఇక, ప్రస్తుతం సమంత (Samantha) తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటోందని, ఈ విషయంలో చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. కానీ తాను సామ్‌కి డబ్బింగ్‌ చెప్పే దశ ముగింపుకి వచ్చిందని చెప్పి చివర్లో షాకిచ్చింది. 

'నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం ఇష్టం ఉండదు. సమంత, నేను (Chinmayi-Samantha) కలిసి మాట్లాడుకున్నాం.. డిన్నర్‌కు వెళ్లాం అని చెప్పడం వల్ల ఎవరికి లాభం? చెప్పండి. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం. సామ్ ఎంతో మంచి వ్యక్తి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను, సామ్ బాగానే ఉన్నాము. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఫొటోలు షేర్ చేయనంత మాత్రాన విడిపోయినట్లు కాదు' అని అన్నారు.

Read More: ‘యశోద’(Yashoda) సినిమా నుంచి సమంత (Samantha) ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్.. సెప్టెంబర్ 9న టీజర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!