సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టినరోజు నేడు.. తండ్రి భావోద్వేగ ట్వీట్.. వైరల్!

Updated on Aug 31, 2022 12:47 PM IST
నా యంగ్‌ (Gautam Ghattamaneni) మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు.
నా యంగ్‌ (Gautam Ghattamaneni) మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడికి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు మహేష్. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 

'నా యంగ్‌ (Gautam Ghattamaneni) మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమయినా నీ వెన్నంటే ఉంటా! లవ్‌ యూ మై సన్‌.. నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు.

అలాగే మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) సైతం తన తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానేది ఎప్పటికీ మర్చిపోలేను. పెద్దయ్యాక అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు నీ ప్రయత్నం చెయ్యు. జీవితంమంటే తుఫాన్ కోసం ఎదురుచూడడమే కాదు. వర్షంలో నాట్యం చేయడం నేర్చుకోవడమే. నీ కలల వెంట పరిగెత్తు. గుర్తుపెట్టుకునే ఎల్లప్పుడూ నీతో నేనుంటాను. నువ్వు ఊహించినదానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.

 

తన అన్నయ్యకు శుభాకాంక్షలు చెబుతూ సితార (Sitara Ghattamaneni) సైతం పోస్టు పెట్టారు. ఒక అద్భుతమైన సోదరుడిగా ఉన్నందుకు.. నాకోసం చేస్తున్న ప్రతిపనికీ.. హ్యాపీ బర్త్ డే అన్నాయ్యా నిన్నెంతో ప్రేమిస్తున్నా అంటూ పలు సందర్భాల్లో గౌతమ్ తో దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. 

Read More: ఫ్యామిలీతో కలిసి 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' షోలో సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!