మరోసారి తన ఉదారత చాటుకున్న మహేష్‌బాబు (Mahesh Babu).. ఫౌండేషన్ ద్వారా డిజిటల్ లెర్నింగ్ తరగతులు ప్రారంభం!

Updated on Oct 27, 2022 12:44 PM IST
మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాలతోనే కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.
మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాలతోనే కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు.

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Super Star Mahesh Babu) మరోసారి తన ఉదారత చాటుకున్నారు. బుర్రిపాలెం గ్రామంలోని సర్కారు బడిలో డిజిటల్ లెర్నింగ్ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ఫౌండేషన్ సహాయం అందించింది. ఈ విషయాన్ని బుర్రిపాలెం పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సోషల్ మీడియా ద్వారా పంచుకొని మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది. ఒక అడుగు ముందుకేసి బుర్రిపాలెం స్కూల్ లో విద్యార్థులు కోసం డిజిటల్ లెర్నింగ్ కి కంప్యూటర్లు ఏర్పాటు చేసింది. ఇది చాలా గొప్ప రోజు” అని పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మహేష్ బాబుని మరోసారి అంతా అభినందిస్తున్నారు.

కాగా, మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాలతోనే కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. ఇప్పటివరకు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇలా ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ గా నిలుస్తున్నారు మహేష్.

ఇక, మహేష్ బాబు (Mahesh Babu) సినిమాల విషయానికి వస్తే..  గత కొన్నేళ్లుగా మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలతో  మహేష్ బాబు హట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 'సర్కారు వారి పాట'తో మరో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న 'SSMB28' సినిమా సెట్స్ మీద ఉంది. ఈ మూవీని 2023, ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు

Read More: రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మహేష్ బాబు (Mahesh Babu)-రాజమౌళి ప్రాజెక్ట్.. విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!