Jani Master: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ టాప్ 10 సాంగ్స్ ఇవే..!

Updated on Jul 02, 2022 04:15 PM IST
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలు (Jany Master Choreography Songs)
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలు (Jany Master Choreography Songs)

Jani Master: టాలీవుడ్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్‌గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోనూ జానీ మాస్టర్ తన సత్తా చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. 

2012లో రామ్ చరణ్ తేజ హీరోగా వచ్చిన 'రచ్చ' సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. దాంతో, రామ్ చరణ్ తన అన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా నియమించాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ పోతినేని, రవితేజ మొదలైన హీరోల సినిమాలకు కూడా పనిచేశాడు. ఆయన తన సినీ ప్రయాణంలో కొరియోగ్రఫీ చేసిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇక్కడ చూసేయండి. 

అరబిక్ కుతు (బీస్ట్) - ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయిన సాంగ్స్ ఏంటంటే బీస్ట్ (Beast Movie) సినిమాలోని అర‌బిక్ కుతు అని చెప్ప‌వ‌చ్చు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ కు జానీ మాస్టర్ బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డెలు సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. అనిరుధ్, జోనితా గాంధీ పాడిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.  

'బీస్ట్' మూవీ పోస్టర్ (Beast Movie Poster)

శ్రీవల్లి సాంగ్ (పుష్ప) - పుష్ప (Pushpa Movie) సినిమా హంగామా ఏ రేంజ్‌లో సాగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంటా బ‌య‌టా కూడా ఈ సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. పుష్ప ఘన విజయంకు ఆ సినిమాలోని పాటలు ప్రధాన కారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అన్ని వర్గాల ప్రేక్షకులు ‘పుష్ప’రాజ్ మ్యాజిక్ లో పడిపోయేలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్పాలి. ‘శ్రీవల్లి’ పాటలోని హుక్ స్టెప్‌తో యూట్యూబ్‌ లో కొంతమంది రచ్చ చేశారు. ఇక చాలామంది సెలబ్రిటీలు సైతం శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. ఏ వాట్సాప్ గ్రూపుల్లో చూసినా ఇదే పాట తెగ చక్కర్లు కొట్టింది.

బుట్ట బొమ్మా (అలా వైకుంఠపురములో) - అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం తెలుగులో ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దులిపేసింది. నిదానమే ప్రధానం అన్నట్లు.. టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది.  

జిగేలు రాణి (రంగస్థలం) - తెలుగు సినిమా ప్రత్యేక గీతాల్లో ‘జిగేలు రాణి..’ ఒకటి. ‘రంగస్థలం’ (Rangasthalam Movie) సినిమాలోని ఈ పాటకు దేవిశ్రీప్రసాద్‌ ఇచ్చిన సంగీతం, దానికి జానీ మాస్టర్‌ రూపొందించిన నృత్య రీతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. డీఎస్పీ, జానీ మాస్టర్‌ కాంబోకి… రామ్‌చరణ్‌, పూజా హెగ్డే తమ గ్రేస్‌ స్టెప్పులు, మాస్‌ మూమెంట్స్‌ కలిసి పాట సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టింది.

జిగేలు రాణి ఐటమ్ సాంగ్ (Jigelu Rani Item Song)

ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ (ఇస్మార్ట్ శంకర్) - పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar) సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయింది. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ అయితే ఏకంగా నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉండేది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపింది ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్. ఒక్కరోజులోనే 3 మిలియన్ వ్యూస్ దాటేసింది ఈ పాట. భాస్కర్ బట్ల లిరిక్స్ అందించిన ఈ పాటకి అనురాగ్ కులకర్ణి గాయకుడు. ఈ చిత్రంలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గా ఈ పాట ఉంటుందనుకుంట. మాస్ బీట్స్ తో ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా మాస్ బీట్స్ ఇచ్చాడు మణిశర్మ.

టెంపర్ టైటిల్ సాంగ్ (టెంపర్) - యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘టెంపర్’ (Temper Movie). టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. చెప్పాలంటే ఈ పాట మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ పాటలో నందమూరి ఫ్యామిలీ హీరోస్ గురించి వచ్చే లైన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. భాస్కర భట్ల కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే ఈ లిరిక్స్ రాసినట్టున్నాడు. సింగర్స్ ఉమా నేహ, ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్, భార్గవి పిళ్ళై, సింహాలు కలిసి ఎంతో జోష్ ఫుల్ గా ఈ పాటని పాడారు. అనూప్ కూడా మాస్ సాంగ్ కి తగ్గరీతిలోనే మ్యూజిక్ అందించాడు.

టెంపర్ టైటిల్ సాంగ్ (Temper Title Song)

సినిమా చూపిస్త మావా (రేసు గుర్రం) - అల్లు అర్జున్–సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన రేసుగుర్రం (Race Gurram) ఎలాంటి విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అందులో సినిమా చూపిస్తా మావా సాంగ్ ఆయితే చిన్న పెద్ద అందరూ కూడా ఇప్పటికి , ఎప్పటికి పాడుకుంటారు..వరికుప్పల యాదగిరి రాసిన మాస్ లిరిక్స్.. తమన్ జోష్ ట్యూన్ కు తోడు.. సింహా-గంగ మంచి ఎనర్జీతో పాడటంతో ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశాడు. బన్నీ ఎనర్జీ.. శ్రుతి హాసన్ గ్లామర్ కూడా ఈ పాటకు ప్లస్సయ్యాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

లైలా ఓ లైలా (నాయక్) - ఈ  పాటలో రామ్ చరణ్ (Ram Charan) చేసిన డాన్సు కైతే వీపరీతమైన స్పందన వచ్చింది. చరణ్ డాన్స్ వేయడానికి బాగా స్కోప్ ఉన్న సాంగ్ ఇది. ఈ పాటలో పాదరసంలా కదులుతూ , పాములా మెలికలు తిరుగుతూ తన డాన్సు తో పాట  మీద పూర్తీ ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా చరణం పూర్తయ్యి బిజియం మొదలయ్యేప్పుడు వచ్చే బీట్ కు చరణ్ వేసిన స్టెప్పులు ... అద్బుతః...!  

లైలా ఓ లైలా సాంగ్ (Laila O Laila Song)

డించిక్ డించిక్ (రెడ్) - ఈ పాటలో రామ్ అదిరిపోయే ఎనర్జితో అందాల భామ హెబ్బా పటేల్‌తో (Hebba Patel) కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. రామ్ తో సమానంగా ఆమె డ్యాన్స్ లు వేసి .. అందరినీ ఆకట్టుకుంది. రామ్ కూడా తనదైన స్టెప్స్‌తో డ్యాన్స్ అదరగొట్టాడు. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్‌కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అటు హెబ్బా పటేల్ అందాలు ఈ పాటకు మరింత ఊపును తీసుకొచ్చాయి. కాగా ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది.

భూమ్ బద్దల్ (క్రాక్) - మాస్ మహారాజా రవితేజ (Raviteja), శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’. రవితేజ పక్కన అప్సర రాణి ఈ పాటలో కాలు కదిపింది. రవితేజ, అప్సర ఇద్దరూ ఎనర్జిటిక్‌గా స్టెప్స్ ఇరగదీసేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ పాడారు.. జానీ మాస్టర్ మాంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పాట రేంజ్ పెంచేసింది.

Read More: క్రేజీ కాంబినేషన్ : RC 15 తర్వాత.. శంకర్ (Shankar) తో సినిమా చేసే టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!