రష్యాలో సినీ ప్రియులను అలరించనున్న 'పుష్ప' (Pushpa).. ప్రమోషన్ల కోసం రంగంలోకి అల్లు అర్జున్ (Allu Arjun)..!

Published on Nov 29, 2022 04:05 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' (Pushpa) సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ విడుదలైన అన్ని భాషల్లో కాసుల పంట పండించి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా 'పుష్ప' (Pushpa) చిత్రం రష్యాలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాను రష్యన్‌ సబ్‌టైటిల్స్‌తో (Pushpa Russian Sub titles) ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వేదిక మీదే ఈ చిత్రాన్ని రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. తాజాగా తేదీని వెల్లడించారు. డిసెంబర్‌ 8న ‘పుష్ప’ చిత్రాన్ని అక్కడ విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది.

మరోవైపు.. డిసెంబర్ 1,3 తేదీల్లో ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ప్రీమియర్లకు హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందన్నా (Rashmika Mandanna), డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar), నిర్మాతలతోపాటు చిత్రయూనిట్ హాజరుకానుంది. తమ సినిమాకు వీలైనంత వరకు ప్రచారం కల్పించనున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ రష్యాకు బయల్దేరి వెళ్లారు. ఆయన ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Read More: అల్లు అర్హ, అయాన్ లతో కలిసి అల్లు అర్జున్ (Allu Arjun) దీపావళి సంబరాలు మామూలుగా లేవుగా.. వీడియో వైరల్!