Yashoda Movie: టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సమంత (Samantha) 'యశోద'.. సినిమా విడుదలలో ఆలస్యం!

Updated on Jul 12, 2022 02:24 PM IST
సమంత (Samantha) నటిస్తున్న యశోద చిత్రంపై ఆమె అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.
సమంత (Samantha) నటిస్తున్న యశోద చిత్రంపై ఆమె అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆమె తాజాగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘యశోద’ (Yashoda). టైటిల్‌ను ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి - హరీశ్ అనే ఇద్దరు కొత్త  డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. 

‘యశోద’ (Yashoda) సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెలరోజులే సమయం ఉండడంతో, చిత్ర ప్రచార కార్యక్రమాలను కూడా షూరు చేసింది యూనిట్ . ఈ సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అందిస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇటీవలే సమంత పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 

హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌‌కే సామ్ ప్రాధాన్యం

‘యశోద’ (Yashoda) సినిమాకు సంబంధించిన పాటలు.. ఇతర ప్యాచ్ వర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సామ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో సత్తా చాటుతోంది. ముఖ్యంగా సమంత.. కమర్షియల్ వ్యాల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు ఓకే చెప్పడం విశేషం. ఇటు కమర్షియల్ వ్యాల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతోనే ‘యశోద’ను  తెరకెక్కించారు.

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sharat kumar), ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

'యశోద' మూవీ సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలలో కాస్త డిఫరెంట్ అని చెప్పాలి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో ఆమె యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. కాగా, సామ్ ఇప్పటికే దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటుతూనే ఉంది.

గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ (The Famiy Man2) వెబ్ సిరీస్‌తో సామ్‌ నేషనల్‌ వైడ్‌గా పాపులర్ అయింది. అందుకే ఇప్పుడు ఈమె నటించే సినిమాలన్నింటినీ హిందీలో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' సినిమా కూడా విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. 

Read More: Liger Poster: 'లైగర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్.. మన హీరోయిన్ల రియాక్షన్ ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!