నయనతార (Nayanthara) స్టార్ హీరోయిన్ కాదంటూ కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్!

Updated on Jul 25, 2022 07:09 PM IST
కరణ్‌ జోహార్‌ (Karan Johar) కల్పించుకుని నాట్ ఇన్ మై లిస్ట్ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.  
కరణ్‌ జోహార్‌ (Karan Johar) కల్పించుకుని నాట్ ఇన్ మై లిస్ట్ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.  

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోకు దేశ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఏడవ సీజన్ రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఇటీవల జరిగిన మూడవ ఎపిసోడ్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గెస్ట్‌లుగా వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ షోలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రస్తావించింది సమంత(Samantha). 'మీకిష్టమైన హీరోయిన్‌ గురించి చెప్పండి? ' అని ప్రశ్నించినప్పుడు సమంత.. 'నయనతార ' పేరు చెప్పారు. తనని 'సౌత్‌ సూపర్‌ స్టార్‌ ' అంటూ కితాబిచ్చింది సమంత. ఆమెతో వర్క్ చేయడం గొప్పగా ఉందని, మర్చిపోలేని అనుభవం అని తెలిపింది. ఈ క్రమంలో కరణ్‌ జోహార్‌ కల్పించుకుని ఆమె తన లిస్ట్‌లో స్టార్‌ కాదని (నాట్ ఇన్ మై లిస్ట్) అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.  

నయనతార (Nayanatara) అభిమానులు కరణ్ జోహార్ పై మండి పడుతున్నారు. 'సౌత్ లేడీ సూపర్ స్టార్ 'గా పేరు గాంచిన నయనతార గురించి కరణ్ జోహార్ కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం 'నయనతార ' డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటే.. కరణ్ జోహార్‌కు నయనతార గురించి తెలియదా? కరణ్‌కు చిప్ లేదా? లిస్ట్‌లో లేకపోవడం ఏంటీ? అని కరణ్ జోహార్ పైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సెల్ఫ్‌  మేడ్‌ యాక్టర్‌గా ఎదిగి, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకొని ఈ స్థాయికి ఎదిగింది నయనతార. దీంతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో టాప్‌లో నిలిచిన నయనతారకి ఇంతటి అవమానమా? అంటూ ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో కరణ్‌ జోహార్‌పై మండిపడుతున్నారు. మీమ్స్‌తో ట్రోలింగ్ (Trolling On Karan Johar) చేస్తూ, ఆయన్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. మరి దీనిపై కరణ్‌జోహార్‌ స్పందిస్తారా? క్షమాపణలు చెబుతారా? అనేది చూడాలి.

Read More: పెళ్లి తర్వాత నయన్, విఘ్నేష్ హవా మామూలుగా లేదుగా.. కోట్లు ఖరీదు గల ఇల్లు కొనుగోలు చేసిన జంట!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!