Samantha: బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సరసన అవకాశం!

Updated on Jul 24, 2022 03:33 PM IST
'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) షోలో సందడి చేసిన ఈ నటి.. అనేక వ్యక్తిగత విషయాలను పంచుకుంది.
'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) షోలో సందడి చేసిన ఈ నటి.. అనేక వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇటీవల సమంత హిందీలో 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆమెతో చేసిన చిట్‌చాట్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో ఆమె చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. 

'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) షోలో సందడి చేసిన ఈ నటి.. అనేక వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యతో విడాకుల విషయంపై తొలిసారి ఓపెన్ అయింది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత తాను ఎంతో మనోవేదనకు గురైనట్లు తెలిపింది. 

అయితే, నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు వరుస పెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సామ్‌కు బాలీవుడ్ నుంచి మరో అదిరిపోయే ఆఫర్ వచ్చింది. మైథలాజికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాలో సామ్‌కు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు 'కాఫీ విత్ కరణ్' షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ (Karan Johar) ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక, సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం 'యశోద', 'శాకుంతలం' (Shakuntalam Movie), 'ఖుషి' చిత్రాలు చేస్తోంది. ఈ సినిమాలన్నీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలతోపాటు ఓ అంతర్జాతీయ మూవీకి కూడా కమిట్‌ అయినట్లు సమాచారం. అలాగే తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్‌ మూవీ కూడా చేయనున్నారు సమంత. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ సినిమాలు కన్ఫమ్‌ కావడం విశేషం. ఈ సినిమాలతో సమంత బాలీవుడ్ లో గట్టిగానే పాగా వేయబోతోంది.

Read More: Samantha Ruth Prabhu: పెళ్లి త‌ర్వాత జీవితం వైలెంట్‌గా ఉంటుంది -  నాగ‌చైత‌న్య‌పై స‌మంత సెటైర్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!