''నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ ని నేను ఇప్పటికీ మంచి స్నేహితులలాగే భావిస్తా'' : రష్మిక మందన్నా (Rashmika Mndanna)

Updated on Oct 06, 2022 11:57 PM IST
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna).. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి, విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna).. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి, విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

దేశవ్యాప్తంగా పాపులారిటీ, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ఈ అందాల భామ ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. మరోవైపు రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. 

తెలుగు చిత్ర పరిశ్రమంలోకి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రష్మిక (Rashmika Mandanna) అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి 'గీతగోవిందం' సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

రష్మిక మందన్నా నటించిన 'పుష్ప' (Pushpa) సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు వరుసగా హిందీ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక హిందీలో ఈమె నటించిన 'గుడ్ బై' సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానుంది. బాలీవుడ్ లో రష్మికకు ఇది డెబ్యూ మూవీ కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna).. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి, అలాగే విజయ్ దేవరకొండ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ ని నేను ఇప్పటికీ మంచి స్నేహితులలాగే భావిస్తాను. వారి ప్రస్తుతం పార్ట్నర్స్, ఫ్యామిలీని మీట్ అయ్యేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సమాధానం ఇచ్చింది. మాజీలతో ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మంచి లక్షణం కాదు. కానీ నేను ఎవరికీ శత్రువుగా ఉండను అని రష్మిక పేర్కొంది.

మరోవైపు.. విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) మీ రిలేషన్ షిప్ గురించి వస్తున్న రూమర్స్ పై ఎలా స్పందిస్తారని అడగగా వినడానికి చాలా క్యూట్ గా ఉంటుంది అంటూ బదులిచ్చింది. దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నిజంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మధ్య ఎఫైర్ ఉందని తెలుస్తోంది.

Read More: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక వ్యాఖ్యలు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!