Ori Devuda: నా దేవుడు 'విక్టరీ వెంక‌టేష్' (Venkatesh) అంటున్న‌ విశ్వ‌క్‌సేన్ (Vishwaksen)!

Updated on Aug 11, 2022 04:36 PM IST
Ori Devuda: 'ఓరి దేవుడా' చిత్రంలో దేవుడి పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్  (Venkatesh) న‌టించనున్నార‌ట‌.
Ori Devuda: 'ఓరి దేవుడా' చిత్రంలో దేవుడి పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్  (Venkatesh) న‌టించనున్నార‌ట‌.

Ori Devuda: టాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌తోనే పాపుర‌ల్ హీరోగా పేరుతెచ్చుకున్న న‌టుడు విశ్వ‌క్ సేన్ (Vishwaksen). ఈ హీరో న‌టించిన‌ ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించింది. విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం 'ఓరి దేవుడా' చిత్రంలో న‌టిస్తున్నారు. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘ఓమై క‌డువ‌లే’ చిత్రానికి రీమేక్‌గా 'ఓరి దేవుడా' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ ఓ స్పెష‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. 

బిజీగా విశ్వ‌క్

విశ్వ‌క్ సేన్ (Vishwaksen) ప్ర‌స్తుతం మూడు సినిమాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. 'ఓరి దేవుడా' చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వ‌త్ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హీరోయిన్ మిథాలీ పార్క‌ర్ విశ్వ‌క్ సేన్‌కు జోడిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా తెర‌కెక్కిస్తోంది. 

దేవుడిగా వెంక‌టేష్

'ఓరి దేవుడా' చిత్రంలో దేవుడి పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్  (Venkatesh) న‌టించనున్నార‌ట‌. విశ్వ‌క్ సేన్‌కు దేవుడిగా వెంక‌టేష్ వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. వీరిద్ద‌రి సీన్ల‌ను మూడు రోజుల్లో చిత్రీక‌రించేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. వెంక‌టేష్ పాత్ర‌ను త‌మిళ వ‌ర్ష‌న్‌లో హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు.. ఇటీవలే ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేసిన‌ విశ్వ‌క్ సేన్‌.. ఈ సినిమా కోసం ఎలాంటి హంగామా చేయ‌నున్నారో!.

Read More: Vishwak Sen : విశ్వక్ సేన్ , ఐశ్వర్య జంటగా నటించే సినిమాకి.. దర్శకుడిగా యాక్షన్ కింగ్ ' అర్జున్ ' !

 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!