విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' (Ori Devuda).. అతిథిపాత్రలో వెంకటేష్(Venkatesh) స‌ర్ ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్!

Updated on Sep 21, 2022 10:06 PM IST
తాజాగా 'ఓరి దేవుడా' (Ori Devuda) సినిమా నుంచి మేక‌ర్స్ ఓ స‌ర్ ప్రైజ్ గ్లింప్స్ (Ori Devuda Glimpse) వీడియో విడుద‌ల చేశారు.
తాజాగా 'ఓరి దేవుడా' (Ori Devuda) సినిమా నుంచి మేక‌ర్స్ ఓ స‌ర్ ప్రైజ్ గ్లింప్స్ (Ori Devuda Glimpse) వీడియో విడుద‌ల చేశారు.

ఈ ఏడాది 'అశోకవ‌నంలో అర్జుణ క‌ల్యాణం' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యువ హీరో విశ్వ‌క్ సేన్ (Vishwak Sen). ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’ (ori devuda). ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్లుగా మిథిలా పాల్కర్, ఆశా భట్ న‌టిస్తున్నారు.  

తమిళంలో అశోక్‌ సెల్వన్‌, 'గురు' ఫేమ్‌ రితికా సింగ్‌ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్‌ ఇది. ఒరిజినల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్‌ మారిముత్తు తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 

పీవీపీ సినిమా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. దిల్ రాజు (Dil Raju) సమర్పిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

ఈ నేపథ్యంలో తాజాగా 'ఓరి దేవుడా' (Ori Devuda) సినిమా నుంచి మేక‌ర్స్ ఓ స‌ర్ ప్రైజ్ గ్లింప్స్ (Ori Devuda Glimpse) వీడియో విడుద‌ల చేశారు. తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మోడ్రన్ భగవంతుని పాత్ర ఒకటి ఉంటుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి ఆ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) చేస్తున్నారు.

'ఓరి దేవుడా' స‌ర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌ (Ori Devuda Surprise Glimpse) పేరుతో ఈ రోజు వెంకటేష్ లుక్ రివీల్ చేశారు. ఆయన విజువల్స్ చూపించారు. అందులో ఆయన తనదైన మేనరిజంతో అలరించారు. 'లవ్ కోర్ట్'లో కేసులు పరిష్కరించే వ్యక్తిగా ఆయన కనిపించారు. వెంకీ అసిస్టెంట్ పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించారు. 

కాగా, ప్రస్తుతం 'ఓరి దేవుడా' (Ori Devuda) సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే, ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయ‌టం డ‌బుల్ స‌ర్‌ప్రైజ్. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు.

Read More: 'విక్టరీ' అనే పదానికి మారుపేరు వెంకటేష్ (Venkatesh) : 'వెంకీ' ఫ్యాన్స్‌కు ఈ టాప్ 10 చిత్రాలు స్పెషల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!