DJ Tillu 2: ‘డీజే టిల్లు’ సీక్వెల్ నుంచి అనుపమా పరమేశ్వరన్ అవుట్?.. ఆమె స్థానంలో ‘ప్రేమమ్’ బ్యూటీ మడొన్నా..!
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘డీజే టిల్లు’ (DJ Tillu) ఒక సంచలనం. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ధమాకా సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టింది. ‘డీజే టిల్లు’తో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఇంతకుముందు ఆయన పలు సినిమాల్లో నటించినా రాని పేరు.. ఈ ఒక్క మూవీతో వచ్చేసింది.
టిల్లు పాత్రలో సిద్ధు చూపిన పెర్ఫార్మెన్స్, తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన సంభాషణలు, మేనరిజం, కామెడీకి యూత్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్, నటన కూడా సినిమాకు ప్లస్‌గా మారాయి. విమల్ కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. విమల్ తోపాటు హీరో సిద్ధు ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరించారు. ఇకపోతే, ‘డీజే టిల్లు’ హిట్ ఊహించని విజయం సాధించడంతో మేకర్స్ సీక్వెల్‌కు ప్లాన్ చేశారు.
‘డీజే టిల్లు’ (DJ Tillu 2) సీక్వెల్‌ను మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఓ వివాదం తలెత్తుతూ ఉండటం గమనార్హం. తొలుత దర్శకుడిగా విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్‌ను తీసుకున్నారు. ఇక హీరోయిన్గా నేహా శెట్టికి బదులుగా అనుపమా పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. అయితే ‘టిల్లు స్క్వేర్’ చిత్రీకరణ వేగంగా జరుగుతున్న సమయంలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)ను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారంటూ ఒక ప్రచారం మొదలైంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రానప్పటికీ గట్టిగా వినిపిస్తోంది. మూవీ యూనిట్‌తో అనుపమకు మధ్య ఏర్పడిన విభేదాలే ఇందుకు కారణమని సమాచారం. ఆమె ప్లేస్‌లో ‘ప్రేమమ్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో నటించిన మడొన్నా సెబాస్టియన్ (Madonna B Sebastian)ను తీసుకున్నారని వినికిడి.
కాగా, ఇటీవల ‘కార్తికేయ 2’ చిత్రంతో అనుపమా పరమేశ్వరన్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. నిఖిల్ హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మళ్లీ నిఖిల్‌తో ‘18 పేజెస్’ మూవీ చేస్తున్నారు అనుపమ. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ ఫిల్మ్.. వచ్చే నెలలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.