సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)? షాక్‌లో అభిమానులు

Updated on Oct 07, 2022 12:05 AM IST
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది
అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది

‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ప్రేమమ్‌ సినిమాలో నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఎందుకోగానీ అంత బిజీ హీరోయిన్‌ కాలేకపోయారు. స్కిన్ షోకు దూరంగా ఉన్న కారణమో లేక అదృష్టం కలసిరాకపోవడంతోనో గానీ పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కలేదు అనుపమకి.

అయితే కొన్ని రోజుల క్రితం వచ్చిన రౌడీబాయ్స్ సినిమాలో లిప్‌లాక్ సీన్స్‌తో రెచ్చిపోయారు అనుపమ. అప్పటివరకు ఉన్న తన ఇమేజ్‌కు భిన్నంగా ఆ సినిమాలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నిఖిల్‌ సిద్దార్ధ్‌ హీరోగా వచ్చిన కార్తికేయ2 సినిమాలో హీరోయిన్‌గా నటించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఆ సినిమా సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ కావడంతో అనుపమ స్టార్ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ బిజీ హీరోయిన్‌ అవుతున్నారు.

అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది

పేరెంట్స్‌ కోసం..

అనుపమకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు గానీ.. అనుపమ అభిమానులు మాత్రం షాకవుతున్నారు. ఈ వార్త నిజం కాకపోతే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. సినిమాలకు అనుపమ పుల్‌స్టాప్ పెట్టబోతున్నారట. తన తల్లిదండ్రలు కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే కొత్త సినిమాలకు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం. ఈ వార్తలో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు.

Read More : Anupama Parameswaran: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న అనుప‌మ ప‌ర‌మేశ్వరన్‌ ‘బటర్‌‌ఫ్లై’ సినిమా? త్వరలో ప్రకటన

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!