మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది.. వాళ్లిద్దరితో మల్టీస్టారర్ సినిమా తీస్తానంటున్న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)

Updated on Aug 30, 2022 01:01 PM IST
ఉప్పెన, కొండపొలం సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’
ఉప్పెన, కొండపొలం సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ హీరోకు మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఉప్పెన' లాంటి లవ్ స్టోరీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత నటించిన కొండపొలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

కొండపొలం ఫ్లాప్ కావడంతో కొద్ది సమయం తీసుకుని రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వరుణ్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన 'రంగ రంగ వైభవంగా' సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించారు.

'రంగ రంగ వైభవంగా' సినిమా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతున్నందున ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు.. హీరో వైష్ణవ్ తేజ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వైష్ణవ్ చెప్పిన కబుర్లు మీకోసం..

ఉప్పెన, కొండపొలం సినిమాల తర్వాత వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’

కథ రాసుకున్నాను..

‘ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో  బిజీగా ఉన్నాను. అయితే, మెగా ఫోన్ పట్టుకోవాలనే కోరిక ఉంది. కొంతకాలం డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను. ఒక కథ కూడా రాసుకున్నాను. ఆ కథతో మా అన్నయ్య సాయితేజ్‌.. మా బావ వరుణ్ తేజ్‌తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఆ టైమ్ వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పారు వైష్ణవ్‌.

ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) డైరెక్షన్ వైపు వెళ్లాలని ఎందుకు ఆలోచిస్తున్నారో మరి. ఒకవేళ దర్శకుడిగా సినిమా చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారనే విషయం తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడక తప్పదు.

Read More : కొత్త సినిమా అనౌన్స్ చేసిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej).. ఆకట్టుకుంటున్న వీడియో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!