‘ఈ వార్తలు ఇక్కడితో ఆగకపోతే బాగుండదు’.. రెండో పెళ్లి రూమర్లపై స్పందించిన నటి మీనా (Actress Meena)!

Updated on Dec 01, 2022 01:21 PM IST
ఇటీవలే భర్త విద్యాసాగర్ (Vidya Sagar)ను కోల్పోయిన మీనా (Actress Meena) ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్ లో పాల్గొంటోంది.
ఇటీవలే భర్త విద్యాసాగర్ (Vidya Sagar)ను కోల్పోయిన మీనా (Actress Meena) ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్ లో పాల్గొంటోంది.

టాలీవుడ్ అలనాటి హీరోయిన్ మీనా (Actress Meena) గురించి  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగి 1990ల కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది మీనా. టాలీవుడ్ లో మాత్రమే కాక తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఎందరో స్టార్ హీరోలతో నటించిన మీనా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

గతంలో స్టార్ హీరోలు సైతం మా సినిమాల్లో కచ్చితంగా మీనా (Actress Meena) హీరోయిన్ గా చేయాలి అని పట్టుబట్టి కూర్చునేవారు. అంతేకాదు ఒకవేళ మీనా డేట్స్ ఖాళీగా లేకపోతే ఆ సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసేవారంటే అప్పట్లో మీనా క్రేజ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి (Megastar Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరు సీనియర్ హీరోలతో నటించిన మీనా 2009 సమయంలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు విద్యాసాగర్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లాడి కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే, ఇటీవలే భర్త విద్యాసాగర్ (Vidya Sagar)ను కోల్పోయిన మీనా (Actress Meena) ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్ లో పాల్గొంటోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా.. గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

నటి మీనా (Actress Meena) రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి మీనా చెవిలో పడింది. ఈ విషయం తెలియగానే మీనా ఆ రూమర్ ని వైరల్ చేసిన వారిపై చాలా మండిపడుతూ.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. నిజమేంటో అబద్ధం ఏంటో తెలియకుండా ఏది పడితే అది రాసేస్తారా.. నా భర్త చనిపోయినప్పుడే నా గురించి ఎన్నో వార్తలు మీడియాలో వచ్చాయి. కానీ ఇక వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే నామీద ఇంకెన్ని వార్తలు వస్తాయో. ఈ వార్తలు ఇక్కడితో ఆగకపోతే బాగుండదు..’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మీనా స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమెపై వచ్చే వార్తలకు పులిస్టాప్ పడినట్లే కనిపిస్తోంది.

Read More: విద్యాసాగర్ మరణం పై వస్తున్న పుకార్లపై స్పందించిన మీనా (Meena) ! తన భర్త మృతిని వివాదాస్పదం చేయవద్దని అభ్యర్థన

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!