పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాలో నటించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పిన నటి మీనా (Meena)

Updated on Oct 06, 2022 11:52 PM IST
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన క్యారెక్టర్ తన డ్రీమ్ రోల్ అని మీనా (Meena) ట్వీట్ చేశారు
పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన క్యారెక్టర్ తన డ్రీమ్ రోల్ అని మీనా (Meena) ట్వీట్ చేశారు

టాలీవుడ్‌లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు నటి మీనా (Meena). ఆరేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలోని ప్రముఖులందరితోనూ కలిసి నటించారు. సుమారు 90 సినిమాల్లో నటించారు మీనా. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోని స్టార్ హీరోలందరితో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్‌ సెల్వన్ (Ponniyin Selvan). రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఇటీవల విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్‌1 మంచి టాక్‌ దక్కించుకుంది. తమిళంలో సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు తెలుగులో మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే పొన్నియిన్ సెల్వన్ సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని టాక్. ఈ సినిమాపై సీనియర్ హీరోయిన్ మీనా సంచలన కామెంట్లు చేశారు.

అందరికీ శుభాకాంక్షలు..

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను చూస్తే అసూయగా ఉందని ట్వీట్ చేశారు మీనా. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యారాయ్ పోషించిన క్యారెక్టర్‌‌ తన ఫేవరెట్‌ అని చెప్పారు మీనా. ఈ సినిమాలో నందిని పాత్ర నా డ్రీమ్‌ రోల్.. అది పోషించిన ఐశ్వర్యారాయ్‌ను చూస్తే అసూయగా ఉందని అన్నారు. నా జీవితంలో మొట్టమొదటిసారి అసూయపడుతున్నాను. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించిన అందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు మీనా. ట్వీట్‌తో రెండు ఈమోజీలను ట్యాగ్ చేశారు.  

చియాన్ విక్రమ్‌, ఐశ్వర్యారాయ్‌, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌ వంటి స్టార్ నటీనటులతో మణిరత్నం తెరకెక్కించిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమా సెప్టెంబర్‌ 30న విడుదలైంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌‌  ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్‌ (Ponniyin Selvan) సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మీనా (Meena) ఏ క్యారెక్టర్‌‌లో నటించలేదు.

Read More : 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' రివ్యూ (Ponniyin Selvan 1 Review) - చోళ రాజుల సాహ‌స యాత్ర‌ను అద్భుతంగా తెర‌కెక్కించిన‌ మ‌ణిర‌త్నం

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!