నందమూరి బాలకృష్ణ (Balakrishna) తాజా సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. కర్నూల్ లో 'NBK107' టైటిల్ లోగో లాంఛ్!

Updated on Oct 19, 2022 05:29 PM IST
ఈ ఈవెంట్ లో బాలయ్య, శృతి హాసన్ (Shruti Haasan), దర్శకుడు గోపీచంద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
ఈ ఈవెంట్ లో బాలయ్య, శృతి హాసన్ (Shruti Haasan), దర్శకుడు గోపీచంద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

‘అఖండ’వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'NBK107' (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అలాగే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను (NBK107 Update) విడుదల చేసింది చిత్రం బృందం. ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేస్తూ.. టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబర్ 21వ తేదీన రాత్రి 8:15 గంటలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ పోస్టర్ ను కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేసారు. ఇందులో బాలయ్య ఫేస్ కనిపించకుండా పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

ఇక, ఈ ఈవెంట్ లో బాలయ్య, శృతి హాసన్ (Shruti Haasan), దర్శకుడు గోపీచంద్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ పోస్టర్ విడుదల చేస్తుండడంపై బాలయ్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'అఖండ' సినిమా హిట్ అవ్వడం, 'అన్ స్టాపబుల్ షో'కి బాగా రీచ్ రావడం, ఇప్పటికే 'NBK107' టీజర్ వైరల్ అవ్వడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలయ్య బాబు. ఆయన అభిమానులు కూడా అదే జోష్ లో ఉన్నారు. దీంతో ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాకు 'రెడ్డిగారు', 'జై బాల‌య్య' (Jai Balayya) అనే టైటిల్స్‌ను ప‌రిశీల‌న‌లో ఉంచిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని టాక్‌ వినిపిస్తోంది. మరి ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి.

Read More: టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కూతురు నందమూరి తేజస్విని (Tejaswini)..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!