టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కూతురు నందమూరి తేజస్విని (Tejaswini)..?

Updated on Oct 17, 2022 12:01 PM IST
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో జోరుగా టాక్‌ నడుస్తోంది.
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో జోరుగా టాక్‌ నడుస్తోంది.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ వైపు సిల్వర్‌ స్క్రీన్ పై సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిజిటల్‌ స్క్రీన్ పై 'అన్ స్టాపబుల్ షో'తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ టాక్‌షోకు ఊహించని స్పందన వస్తోంది. ఇటీవలే ప్రసారమైన 'అన్ స్టాపబుల్' (Unstoppable With NBK Season 2) రెండవ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హాజరయ్యారు. కాగా, ఈ షో టీఆర్పీ రేటింగ్‌లో హయ్యెస్ట్‌ వ్యూస్ ను దక్కించుకుంది. 

అయితే, 'అన్ స్టాపబుల్ షో'లో (Unstoppable Talk Show) బాలయ్య సక్సెస్ వెనుక తన చిన్న కూతురు తేజస్విని (Tejaswini) హస్తం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు బాలకృష్ణ ఈ సెలబ్రిటీ టాక్ షో కి ఒప్పుకోవడానికి కారణం తేజస్విని అట. పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్‌స్టాపబుల్‌ షోకు క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిందట బాలయ్య చిన్న కూతురు తేజస్విని. అంతేకాదు బాలయ్య స్ట్రిప్ట్‌ వర్క్‌కు, డేట్స్, కాస్ట్యూమ్స్ కు సంబంధించిన పనులు కూడా ఆమెనే చూసుకుంటుందట. దీంతో అన్‌స్టాపబుల్‌ షో హిట్‌ కావడంలో బాలయ్య కూతురు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో తేజస్విని (Tejaswini) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌లో జోరుగా టాక్‌ నడుస్తోంది. ఇంతకీ ఏ కేటగిరిలో వర్క్‌ చేస్తుందనే కదా మీ డౌటు. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం నిర్మాతగా మారనుందట తేజస్విని. తనకంటూ ఒక సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తోందట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా తోనే తేజస్విని నిర్మాతగా మారబోతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా అన్నది భవిష్యత్తులో చూడాలి. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ నటవారసుడిగా ఆయన కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే ఎన్నో వార్తలు తెరపైకి వచ్చినా.. అధికారికంగా మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini) వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఇక, బాలకృష్ణ ప్రస్తుతం అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌తో బిజీగా ఉన్నారు. దీనితో పాటు గోపిచంద్‌ మలినేని (Director Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్‌బీకే 107'లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అనిల్‌ రావిపూడితో (Director Anil Ravipudi) కలిసి 'ఎన్‌బీకే 108' మొదలుపెట్టబోతున్నాడు.

Read More: 'అన్‌స్టాపబుల్ సీజన్ 2' (Unstoppable Season 2) రెండో ఎపిసోడ్ ప్రోమో (Promo) అదిరిపోయిందిగా.. గెస్టులు వీరే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!