'ఎన్‌బీకే 107' (NBK 107) రిలీజ్ తేదీ ఫిక్స్ అయిన‌ట్టేనా!..మోత మోగ‌నున్న బాల‌కృష్ణ (Balakrishna) డైలాగులు

Updated on Aug 19, 2022 01:23 PM IST
బాల‌కృష్ణ (Balakrishna) సినిమా 'ఎన్‌బీకే 107' సినిమాను 2023 ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.
బాల‌కృష్ణ (Balakrishna) సినిమా 'ఎన్‌బీకే 107' సినిమాను 2023 ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

NBK 107: టాలీవుడ్ స్టార్ హీరో బాల‌కృష్ణ (Balakrishna) సినిమాల‌కు డిమాండ్ పెరిగింది. 'అఖండ' సినిమా త‌ర్వాత ఎలాంటి మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో బాల‌కృష్ణ వినోదం పంచ‌నున్నారోన‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం 'బాల‌కృష్ణ' ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేనితో 'ఎన్‌బీకే 107' అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా వేస‌విలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక వేస‌విలో బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు థియేట‌ర్ల‌లో పేల‌నున్నాయి.

'ఎన్‌బీకే 107' షూటింగ్ జోరు

'క్రాక్' సినిమాతో ద‌ర్శ‌కుడు గోపిచంద్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందుకున్నారు. 'అఖండ‌'తో బాల‌కృష్ణ (Balakrishna) సూపర్ డూప‌ర్ హిట్ సాధించారు. ఇక వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న 'ఎన్‌బీకే 107' సినిమా అద‌రిపోతుందని అభిమానులు అంటున్నారు. 'ఎన్‌బీకే 107' వ‌చ్చే వేస‌విలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఏపీలోని క‌ర్నూలులో ప‌లు స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో బాల‌కృష్ణకు జోడిగా శృతి హాసన్ న‌టిస్తున్నారు.  

స‌మ్మ‌ర్‌లో బాల‌య్య సినిమా రిలీజ్

బాల‌కృష్ణ (Balakrishna) సినిమా 'ఎన్‌బీకే 107' సినిమాను 2023 ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటిస్తున్న 'ఎస్ఎస్ఎంబీ 28' సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ రెండు సినిమాలు వ‌రుసగా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఎన్‌బీకే 107 నుంచి రిలీజ్ అయిన‌ పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో బాల‌కృష్ణ  అఖండ విజ‌యం సాధిస్తార‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read More: బాలకృష్ణ (Balakrishna) అభిమానులా మజాకా? కర్నూలులో రచ్చ మామూలుగా లేదు.. వైరల్ అవుతున్న వీడియో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!