'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK) ట్రైలర్ వచ్చేసింది... ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో బాలయ్య!

Updated on Oct 09, 2022 02:52 PM IST
బాల‌య్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK)తో మ‌రోసారి అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.
బాల‌య్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK)తో మ‌రోసారి అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'(Aha) లో ప్రసారమయ్యే ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable With NBK)... టాక్ షో స్పెషాలిటీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable With NBK) టాక్ షో ఆయన అభిమానులకే కాకుండా.. తెలుగు ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది. సినీ స్టార్ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్లందరితో ఈ షోని సరదగా తనదైన శైలిలో నడిపించారు బాలకృష్ణ. ఈ షో ద్వారా బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది.

ఈ నేపథ్యంలో బాల‌య్య 'అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2' (Unstoppable With NBK)తో మ‌రోసారి అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ సీజ‌న్ 2 ట్రైలర్‌ను ఆదివారం 'ఆహా' విడుద‌ల చేసింది.

ట్రైలర్ లో (Unstoppable With NBK Trailer) ఈ టాక్ షో గురించి చూపించకుండా జాగ్రత్త పడ్డారు. ఒక నిధి కోసం బాలయ్య బాబు వెతికినట్టు, ఎన్నో అవరోధాలని దాటుకొని ఆ నిధిలో ఉన్న కత్తిని బాలయ్య చేజిక్కించుకున్నట్టు ట్రైలర్ లో చూపించారు. ఆ కత్తితో షోలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెప్పించారు.

"అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమేజనబుల్.. అక్కడేదురయ్యే సవాళ్లు అన్ ప్రెడిక్టబుల్.. అయినా ఆగని మన పోరాటం అన్‌స్టాపబుల్".. "ప్రశ్నల్లో మరింత ఫెయిర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. అన్‌స్టాపబుల్" అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు చెప్పారు. ఇక, 'అన్‌స్టాపబుల్' ప్రోగ్రామ్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్వాహకులు తెలిపారు. 

Read More: త్వరలో 'అన్‌స్టాపబుల్ విత్ NBK Season 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. బాలయ్య 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాల'!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!