నెక్స్ట్ లెవల్‌లో బాలయ్య (Balakrishna) అన్‌స్టాపబుల్ సీజన్ 2.. ఈసారి గెస్ట్‌లుగా చిరు, వెంకీ, నాగ్! 

Updated on Oct 06, 2022 03:20 PM IST
అన్‌స్టాపబుల్ సీజన్ 2 (unstoppable season 2)తో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తానని బాలకృష్ణ (Balakrishna) అన్నారు
అన్‌స్టాపబుల్ సీజన్ 2 (unstoppable season 2)తో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తానని బాలకృష్ణ (Balakrishna) అన్నారు

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. తన నటనతో లక్షలాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తనదైన మార్క్ యాక్టింగ్‌తో, డైలాగ్ డెలివరీతో వెండితెరపై అలరించే బాలయ్య.. బుల్లితెర పైనా ఒక షోతో సందడి చేశారు. 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ ఛాట్‌ షో ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. బాలయ్య అంటే ఎప్పుడూ గంభీరంగా ఉంటారు, సినిమాల్లో తాను పోషించిన పాత్రల్లాగే ఆయన కూడా సీరియస్‌గా ఉంటారని చాలామంది అనుకునేవారు. కానీ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన బాలకృష్ణ.. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌‌తో మరింత మందికి అభిమాన సెలబ్రిటీగా మారారు. 

అన్‌స్టాపబుల్‌ టాక్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలతో బాలయ్య పంచుకున్న కబుర్లు ఈ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. అదే సమయంలో ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌కు మంచి పాపులారిటీని తీసుకొచ్చాయి. అలాంటి ఈ షోలో ఇప్పుడు మరింత వినోదాన్ని జోడిస్తూ ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. 

ఈ సందర్భంగా ‘ఆహా’ నిర్వాహకులు ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్ 2 ప్రీ లాంచ్‌ ఈవెంట్‌‌ను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు వినోదం అందించడమే తన ధ్యేయమని బాలకృష్ణ అన్నారు.

ఇంట్లో ఆమెనే అన్‌స్టాపబుల్‌

‘బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం నా భార్య వసుంధరే అన్‌స్టాపబుల్‌’ అని బాలయ్య అన్నారు. ఆమె తనను భరిస్తోందని పేర్కొన్నారు. ‘వసుంధరే మా కుటుంబాన్ని లీడ్ చేస్తోంది. సినిమాలు, ఆస్పత్రి విషయాల్లో నేను బిజీగా ఉంటే.. మిగతా విషయాలు తనే చూసుకుంటుంది. అందుకే ఇంట్లో ఆమె అన్‌స్టాపబుల్’ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఈ సీజన్‌లో చిరు, నాగ్, వెంకీ వచ్చే ఛాన్స్!

అన్‌స్టాపబుల్‌ సెకండ్ సీజన్‌లో వచ్చే గెస్టుల పైనా బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఈసారి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. కచ్చితంగా తొలి సీజన్‌ కంటే రెండో సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ బాలయ్య స్పష్టం చేశారు. 

ఈవెంట్ చివర్లో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బాలకృష్ణ సరదాగా ఇచ్చిన సమాధానం అందర్నీ నవ్వించింది. ‘మిమ్మల్ని నేను మావయ్యా అని పిలవచ్చా?’ అని యాంకర్ అడిగారు. ఈ క్వశ్చన్‌కు బాలయ్య స్పందిస్తూ.. ‘మా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్య అని పిలిపించుకోను. బాలా అని పిలుస్తారు’ అని ఫన్నీగా జవాబిచ్చారు. 

Read more: టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!