త్వరలో 'అన్‌స్టాపబుల్ విత్ NBK Season 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. బాలయ్య 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాల'!

Updated on Sep 17, 2022 07:28 PM IST
అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ (Unstoppable Season 2) అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది ఆహా యాజమాన్యం.
అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ (Unstoppable Season 2) అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది ఆహా యాజమాన్యం.

నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna) సినిమాలతోపాటు షోలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్‌1లో సందడి చేశారు. పెద్ద సెలబ్రిటీ అయ్యిఉండి కూడా సెలబ్రిటీలతో, అభిమానులతో ఆయన చేసిన అల్లరికి అందరూ ఫిదా అయ్యారు.

బాలకృష్ణ స్టైల్, యాటిట్యూడ్, మాట తీరు, మంచితనం, కోపం మిగతా హీరోలకు ఉండదు. మంచి పని చేస్తే చప్పట్లు కొట్టే ఆ చేతులే.. చెడ్డ పని చేస్తే చెంప పగులకొట్టే చనువు కూడా తీసుకుంటారు బాలయ్య.

అన్‌స్టాపబుల్ విత్ NBK అంటూ టాక్ షోను ప్రారంభించి సీజన్‌ను విజయవంతంగా ముగించారు కూడా. ఈ షోకి వచ్చిన గెస్ట్ లతో బాలయ్య ఆట ఆడించిన తీరు.. ఆయన పలకరించిన విధానం.. ఆయన నవ్వించిన పద్ధతి.. జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తనకు మిగతా హీరోలకు ఏదో గొడవ ఉందంటూ గాసిప్స్ వచ్చినా కూడా మా మధ్య ఏమీ లేదంటూ పటాపంచలు చేసిన తీరు జనాలను అలరించింది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లు రెండో సీజన్‌పై పడ్డాయి. 

నిజం చెప్పాలంటే ఆయన నటించే సినిమాల కంటే ఎప్పుడెప్పుడు ఈ షో సీజన్ 2 స్టార్ట్ అవుతుందా అని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షో కొత్త సీజన్ ని టెలికాస్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆహా.

అన్‌స్టాప‌బు‌ల్ రెండో సీజ‌న్ (Unstoppable Season 2) అతి త్వ‌ర‌లో ముందుకు వ‌స్తోందంటూ ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది ఆహా యాజమాన్యం. అయితే, కొత్త సీజ‌న్ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా పేర్కొనలేదు. పండ‌గ త్వరలోనే మొద‌వుతుంది.. అంటూ హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఈ నేప‌థ్యంలో ద‌సరా లేదా దీపావ‌ళికి కొత్త సీజ‌న్ ప్రారంభం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా' అంటూ బాల‌య్య మార్కు డైలాగ్ మాదిరి హ్యాష్‌ట్యాగ్ ను జ‌త చేసింది.

ఈ సీజన్‌లో ఎవరెవరు అతిథులుగా వస్తారా? అనే దానిపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే సీజన్ 2లో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేనప్పటికీ.. మెగాస్టార్ వస్తే షో నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అంటున్నారు. మెగా, నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి ఏంజరుగుతుందో. 

Read More: రికార్డులు కొల్ల‌గొడుతున్న‌ బాలయ్య (Unstippable with NBK) 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె' టాక్ షో!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!