కృష్ణంరాజు ( Krishnam Raju) గారు మా హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు - అనుష్క (Anushka)

Updated on Sep 11, 2022 02:24 PM IST
కృష్ణంరాజు (Krishnam Raju) ఓ సందర్భంలో ప్ర‌భాస్‌కు అనుష్క (Anushka) మంచి స్నేహితురాల‌ని అన్నారు.
కృష్ణంరాజు (Krishnam Raju) ఓ సందర్భంలో ప్ర‌భాస్‌కు అనుష్క (Anushka) మంచి స్నేహితురాల‌ని అన్నారు.

టాలీవుడ్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతిపై హీరోయిన్ అనుష్క సంతాపం తెలిపారు.కృష్ణంరాజుతో దిగిన ఫోటోను అనుష్క (Anushka) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌మ‌కు కృష్ణంరాజు ఎంతో ఆత్మీయులంటూ ఎమోష‌న్ అయ్యారు. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. విశాల హృదయం కలిగిన ఓ దిగ్గజం కృష్ణంరాజు గార‌ని .. త‌మ హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటార‌ని అనుష్క ట్వీట్ చేశారు. 

కృష్ణంరాజుకు అనుష్క నివాళి

హీరో ప్రభాస్,  కృష్ణంరాజు (Krishnam Raju) కుటుంబంతో అనుష్కకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. కృష్ణంరాజు కూడా ఓ సందర్భంలో ప్ర‌భాస్‌కు అనుష్క మంచి స్నేహితురాల‌ని అన్నారు. కృష్ణంరాజుతో దిగిన ఫోటోను అనుష్క త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

వెంటిలేట‌ర్‌పై ఉన్న కృష్ణంరాజును అనుష్క ఆస్ప‌త్రికి వెళ్లి మ‌రీ ప‌రామ‌ర్శించారు. అనుష్క ఏఐజీ ఆస్ప‌త్రిలో కృష్ణంరాజును చూసి వ‌స్తున్న విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

రేపు కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు
కృష్ణంరాజు (Krishnam Raju) సెప్టెంబ‌ర్ 11 తెల్లవారుఝామున 3.16 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కృష్ణంరాజు పార్థివదేహాన్ని సెప్టెంబ‌ర్ 11 మ‌ధ్యాహ్నం 12 గంటలకు ఆయ‌న నివాసానికి తీసుకొస్తారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచుతారు. అలాగే రేపు ఉద‌యం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఫిలిమ్ ఛాంబ‌ర్‌కు తరలించనున్నారు. ఆ త‌రువాత‌ అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Read More: కృష్ణంరాజు (Krishnam Raju) ను చివ‌రి సారి వెంటిలేటర్‌పై చూసిన ప్ర‌భాస్ (Prabhas)!.. రేపు మ‌ధ్యాహ్నం అంత్య‌క్రియ‌లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!