జమ్మూ కశ్మీర్‌లో వాలిపోయిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. 'జనగణమన' (Janaganamana) సినిమా కోసమేనా..?

Updated on Oct 17, 2022 05:13 PM IST
తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో దర్శనమిచ్చారు.
తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో దర్శనమిచ్చారు.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుసగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో (Rashmika Mandanna) కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లారనే ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ లో పెట్టుకున్న కళ్లద్దాలు.. రష్మిక మందన్న వెకేషన్ లో పెట్టుకోవడంతో వీరిద్దరూ కలిసే వెకేషన్ కు వెళ్లారనే వార్తలకు బలం చేకూరినట్లయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతంలో దర్శనమిచ్చారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖకు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న 'యూరీ' సెక్టార్ ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత సైనికులను కలిసి, వారితో సరదాగా ముచ్చటించారు. సైనిక జాకెట్ ధరించి, తుపాకీ చేతబట్టారు. అంతేకాదు, ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ని సందర్శించి, తుపాకీ కాల్చడంపై అక్కడి జవాన్లను అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ‘భారత సైన్యంలోని కఠినమైన వ్యక్తులతో నేను’ అని తన ట్వీట్‌కు విజయ్ దేవరకొండ క్యాప్షన్ పెట్టారు. ఆర్మీ జవాన్ల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి గన్లతో విజయ్ దేవరకొండ ఫోజులిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘యూరీ’ (Uri) హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించారు.

అయితే, తాజా ఫోటోలు చూసిన వారందరికీ కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. పూరీ జగన్నాథ్ సినిమా ‘జనగణమన’ను పట్టాలెక్కిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ‘లైగర్‌’ (Liger) సినిమా తర్వాత పూరీ తన కలల ప్రాజెక్ట్‌ ‘జనగణమన’ (Janaganamana) చేయాల్సి ఉంది. కానీ 'లైగర్' దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ఈ సినిమా పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేసిన ఫొటోలు చూస్తుంటే.. పూరీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందా అనే అనుమానం కలుగుతోంది.

ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ (Puri Jagannath), విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘లైగర్’ సినిమా నిరాశపర్చిందన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయి... నిర్మాతలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే, ఈ సినిమా విడుదల కావడానికి ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జన గణ మన’ (Janaganamana) అనే సినిమాను కూడా ప్రకటించారు. విజయ్ దేవరకొండ ఆర్మీ యూనిఫాం‌లో హెలీకాప్టర్‌లో దిగుతున్న అదిరిపోయే వీడియో ఒకటి విడుదల చేశారు.

ఇక.. ‘లైగర్’ తరవాత విజయ్ దేవరకొండ ప్రకటించిన మరో చిత్రం ‘ఖుషి’ (Kushi). ఇందులో సమంత (Samantha) హీరోయిన్ నటిస్తోంది. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల దర్శకుడు శివ నిర్వాణ.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 23న సినిమాను విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు మేకర్స్.

Read More: Vijay Deverakonda : విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారని రూమర్స్.. మాల్దీవుల ట్రిప్‌లో "గీత గోవిందం" జంట !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!