ఓటీటీలో విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్' (Liger).. సెప్టెంబర్ 30 నుంచి ప్రసారం?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్' (Liger). 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. అనన్యపాండే హీరోయిన్‌గా నటించగా ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు.
అయితే.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో మేకర్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ (Liger OTT Release Date) అయింది.
ఇప్పటికే, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ (Disney Plus Hotstar) కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30 నుండి స్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి బాక్సాఫీస్ వద్ద విఫలమైన లైగర్.. కనీసం ఓటీటీలో అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే.. 'లైగర్' ఫ్లాప్‌తో హీరో విజయ్ దేవరకొండతోపాటు (Vijay Deverakonda) పూరీ కనెక్ట్స్ నిర్మాతలైన ఛార్మి (Charmee), పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో విజయ్ ఓవరాక్షన్, నోటి దురుసు వల్లే లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యిందని, అతడిని నమ్ముకున్నందుకు పూరీ కనెక్ట్స్ పని అయిపోయిందంటూ సోషల్ మీడియా విమర్శలు చేస్తున్నారు.
చార్మి, పూరీ కనెక్ట్స్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా అసలు బాగాలేదని, విడుదలకు ముందు క్రియేట్ చేసిన హైప్ కథలో అసలే లేదని.. కథ, కథనం చాలా వీక్‌గా ఉన్నాయని విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ కారణంగానే చార్మి సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..