"కృష్ణంరాజు (Krishnam Raju) లేనిలోటు నాకూ, సినీ పరిశ్రమకూ ఎప్పటికీ తీరనిది".. చిరంజీవి (Chiranjeevi) ట్వీట్

Updated on Sep 11, 2022 05:45 PM IST
రెబల్‌స్టార్‌ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
రెబల్‌స్టార్‌ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 3:25 గంటలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక, ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కృష్ణం రాజు (Krishnam Raju) భౌతికకాయాన్ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో కృష్ణంరాజుతో (Krishnam Raju) ఎంతో సన్నిహితంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెబల్‌స్టార్‌ అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమది ఆత్మీయ అనుబంధం అని, తనను పెద్దన్నలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.

ఆయన లేనిలోటు వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు తీరని లోటని ట్వీట్‌ చేశారు చిరంజీవి (Megastar Chiranjeevi Tweet). ‘కృష్ణంరాజు గారు ఇక లేరనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా పోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనఊరి పాండవులు’ దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది.

ఆయన ‘రెబల్‌ స్టార్‌’కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేనిలోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు లాంటి ప్రభాస్‌కు నా సంతాపం తెలియచేస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

Read More: ఆ రెండు చివరి కోరికలు తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచిన రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebelstar Krishnam Raju)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!