'మెగా154' (Mega154) లో 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి (Chiranjeevi).. 'వైజాగ్ రంగరాజు'గా రవితేజ (Raviteja)..!

Updated on Oct 17, 2022 02:11 PM IST
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేటి తరం స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంటే.. చిరంజీవి  ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలలో నటించేశారు. అందులో ఒకటి 'ఆచార్య' (Acharya)  కాగా, మరొకటి 'గాడ్ ఫాదర్' (God Father). ఇందులో 'ఆచార్య' సినిమా డిజాస్టర్ కాగా, 'గాడ్ ఫాదర్' చిరంజీవి కెరీర్‌లో మరో సూపర్ హిట్‌గా నిలిచింది.

మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన 'గాడ్ ఫాదర్' (God Father) సినిమా దసరా కానుకగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా మలయాళ మూవీ 'లూసీఫర్' కు రీమేక్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్‌గా నటించి అలరించారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజ్ రవితేజ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ బాబీ (Director Bobby) తెర‌కెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా డబ్బింగ్ పనులు సైతం షురూ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

చిరంజీవి-రవితేజ (Raviteja) కాంబోలో వస్తున్న ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. చిరంజీవి ఈ చిత్రంలో మత్యకారుడిగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 

అయితే ఈ సినిమాలో రవితేజ (Raviteja) పాత్ర గురించిన చర్చ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో రవితేజ 'వైజాగ్ రంగరాజు' అనే మాస్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందట. 'వైజాగ్ రంగరాజు'గా రవితేజ చేసే రచ్చ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. ఆయ‌న పాత్ర ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని  టాక్. మరి ఇదే నిజ‌మైతే ర‌వితేజ ఫ్యాన్స్‌కు క‌న్నుల పండుగే మరి.  

Read More: Chiranjeevi: 'మెగా154' (Mega 154) నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నేటి నుంచి డబ్బింగ్ ప్రారంభం.. దీపావళికి టీజర్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!