అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!

Updated on Oct 18, 2022 10:41 AM IST
అల్లు అర్జున్, రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా మల్టీస్టారర్ సినిమా నిర్మించాలని ఉందని ఓ అగ్ర నిర్మాత తన మనసులోని మాటను బయట పెట్టేశారు.
అల్లు అర్జున్, రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా మల్టీస్టారర్ సినిమా నిర్మించాలని ఉందని ఓ అగ్ర నిర్మాత తన మనసులోని మాటను బయట పెట్టేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహ ఎంత బావుందో కదూ! ఈ ఇద్దరినీ ఒకేసారి తెరపై చూడాలని కోరుకోని మెగా అభిమాని ఉంటాడా? మెగా అభిమానుల సంగతి పక్కన పెడితే, సగటు సినీ అభిమాని సైతం ఈ కాంబినేషన్ కోసం ఒకింత ఆసక్తిగానే ఎదురుచూస్తాడు.

అయితే, ఇప్పటికే బన్నీ-చెర్రీ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 'ఎవడు' చిత్రంలో వీరిద్దరు నటించారు. కానీ ఎవరి పాత్ర వారికి సెపరేట్‌. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ మాత్రం ఉండవు. సినిమాలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చరణ్ హీరోగా నటించడం విశేషం. 

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా నిర్మించాలని ఉందని ఓ అగ్ర నిర్మాత తన మనసులోని మాటను బయట పెట్టేశారు. ఆయన ఎవరు? అసలు కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... ఆ అగ్ర నిర్మాత ఎవరో కాదు... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind). బుల్లితెరపై ఈటీవీ లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. ‘‘ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఎలా ఉంటుందో నాకు తెలియ‌దు కానీ.. నాకొక కోరిక ఉంది. గీతా ఆర్ట్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌ , అల్లు అర్జున్ (Allu Arjun) క‌లిసి సినిమా చేస్తే బావుంటుంది. ఈ మ‌ల్టీస్టార్ కాంబినేష‌న్‌కి ప‌దేళ్ల క్రితం నేను చ‌ర‌ణ్ – అర్జున్ (Charan Arjun) అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిష్ట‌ర్ చేశాను. ఆ టైటిల్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌ను రెన్యువ‌ల్ చేస్తూనే ఉన్నాను. ఎప్ప‌టికైనా జ‌రుగుతుంద‌నే నా న‌మ్మ‌కం’’ అని అన్నారు. 

'ఎవడు' సినిమా సమయంలో రామ్ చరణ్ ఇమేజ్ వేరు. అల్లు అర్జున్ స్టార్ డమ్ వేరు. ప్రస్తుతం వాళ్ళిద్దరి ఇమేజ్ వేరు. ఇప్పుడు ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. 'పుష్ప 2' షూటింగ్ చేయడం కోసం అల్లు అర్జున్ రెడీ అవుతుండగా.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయనున్నారు.

ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళిద్దరూ చేసే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని మరో సందేహం లేకుండా చెప్పవచ్చు. అయితే, గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) బ్యానర్ పై బన్నీ-చెర్రి కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు. మరి, ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.

Read More: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule) ఆసక్తికర అప్డేట్.. షూటింగ్ లొకేషన్‌లో సుకుమార్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!