సురేందర్ రెడ్డి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్ లో మూవీ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాత!

Updated on Sep 02, 2022 03:41 PM IST
సరిగ్గా 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజున, నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమా ప్రకటించారు.
సరిగ్గా 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజున, నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమా ప్రకటించారు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో రెండేళ్ల క్రితం అఫీషియల్‌గా ఓ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున, నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని కూడా ఆయన ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్‌లు విడుదల కాలేదు. 

దీంతో పవన్ కల్యాణ్ (Pawan kalyan) పుట్టిన రోజు సందర్భంగా అయినా అప్ డేట్ ఇవ్వండని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మేకర్స్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ నెటిజన్ ఈ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ ఇవ్వమని అడిగాడు. దీంతో ఈ మూవీకి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇచ్చి మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నిర్మాత రామ్ తళ్లూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

నిర్మాత రామ్ తళ్లూరి .. "ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని సురేందర్ రెడ్డి 'ఏజెంట్' (Agent) మూవీ పూర్తి చేశాక మన సినిమా ప్రారంభం అవుతుంది".. అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి, అక్కినేని అఖిల్ కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న 'ఏజెంట్' మూవీ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్టు కన్‌ఫర్మ్ అయింది. 

Pawan Kalyan Surender Reddy Combo Movie Poster

కాగా, ఈ సినిమాకు వక్కంతం వంశీ (Vakkantham Vamshi) కథను  అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి (Krrish Jagarlamudi) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దాయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కీలక పాత్ర పోషిస్తోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. 

Read More: Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ ద్వారా సెలబ్రిటీల విషెస్ వెల్లువ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!