పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) నుంచి సరికొత్త అప్డేట్..!

Updated on Aug 31, 2022 02:24 PM IST
'హరిహర వీరమల్లు' (HariharaVeeramalluUpdate) నుంచి అప్‌డేట్‌ రెడీ చేసింది యూనిట్‌. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.   
'హరిహర వీరమల్లు' (HariharaVeeramalluUpdate) నుంచి అప్‌డేట్‌ రెడీ చేసింది యూనిట్‌. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.   

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా క్రిష్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu). 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు-కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ మూవీని అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం (A M Ratnam) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కెరీర్ లో మొట్టమొదటిసారి పీరియాడిక్ జోనర్ లో సినిమా చేస్తుండడంతో ఆయన అభిమానులు మాత్రమే కాదు.. ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

కాగా, కరోనా సంక్షోభం నేపథ్యంలో పలుమార్లు ఈ చిత్రం షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు షూటింగ్ కనీసం సగం అయినా పూర్తైందా..? అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. ఈ క్రమంలో 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu Update) నుంచి అప్‌డేట్‌ రెడీ చేసింది యూనిట్‌. పవన్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.   

సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు ఈ చిత్రం నుంచి 'పవర్ గ్లాన్స్' (Power Glance) విడుదల కానుంది. మాసివ్‌ జాతరకి సిద్దం కండి అంటూ పేర్కొంది. అందులో భాగంగా ఈ చిత్రంలోని యాక్షన్‌ కట్‌ని వీడియో రూపంలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇందులోని పవన్‌ కల్యాణ్ ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలను చూపించబోతున్నారు. దీంతో సినిమాపై హైప్‌ని మరింత పెంచే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది.

Read More: #PawanKalyanBdayCDP : సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ బర్త్ డే పోస్టర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!