Agent : ఏజెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కినేని అఖిల్ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు !

Updated on Jul 11, 2022 06:26 PM IST
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న ఏజెంట్ సినిమా పై ట్రేడ్ వర్గాలతో పాటు, అభిమానులలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న ఏజెంట్ సినిమా పై ట్రేడ్ వర్గాలతో పాటు, అభిమానులలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni ).. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరోలలో తనకంటూ నెమ్మదిగా ఒక ఇమేజ్‌ను ఏర్పరచుకుంటున్న నటుడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Most Eligible Bachelor) సినిమా చేసిన అఖిల్.. ఇప్పుడు తాజాగా నటిస్తున్న చిత్రం 'ఏజెంట్. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

'ఏజెంట్' సినిమా ట్రైలర్ ఈ నెల 15 తేదిన విడుదల కానున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇదే చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల చెంతకు వస్తుందని కూడా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం,  సురేందర్ రెడ్డి (Surender reddy) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

తమన్ ఈ సినిమా గీతాలకు బాణీలను సమకూర్చగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సిక్స్ ప్యాక్‌తో అఖిల్

ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారట. పూర్తిగా స్పై థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అఖిల్ (Akhil Akkineni)  ఈ చిత్రానికి ఒక పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని టాక్. సినిమా బడ్జెట్‌ని, నిర్మాతల అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సినిమా విడుదలయ్యాక, చిత్రం హిట్ అయితే.. అప్పుడు లాభాల్లో వాటా తీసుకుంటానని, ప్రస్తుతానికి రెమ్యూనరేషన్ వద్దని అఖిల్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

సినిమాపై భారీ అంచనాలు

ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. అతనొక్కడే, కిక్, అతిథి, రేసుగుర్రం, ధ్రువ, సైరా లాంటి డిఫరెంట్ సబ్జెక్టులను డీల్ చేసిన సురేందర్ రెడ్డి, ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారంటే, అభిమానులు కచ్చితంగా ఏదో విషయాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారన్నది సత్యం. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. స్టైలిష్ గెటప్‌లో అఖిల్ ఈ ఫస్ట్ లుక్‌లో సూపర్‌గా ఉన్నాడని ఇప్పటికే ఈయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. 

Read More: సుదీప్ మైండ్ సెట్ ఎంతో పవర్ఫుల్.. అక్కినేని అఖిల్ (Akhil) ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!