దిగ్గజ దర్శకనిర్మాతలతో బాలకృష్ణ (Balakrishna) 'అన్ స్టాపబుల్ 2' (Unstoppable 2).. ఎపిసోడ్ 5 ప్రోమో రిలీజ్!

Updated on Dec 01, 2022 03:06 PM IST
'అన్ స్టాపబుల్' షోలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సురేశ్ బాబు (SureshBabu), అల్లు అరవింద్ (AlluAravind) తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు.
'అన్ స్టాపబుల్' షోలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సురేశ్ బాబు (SureshBabu), అల్లు అరవింద్ (AlluAravind) తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' (Aha OTT) వేదికగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న 'అన్ స్టాపబుల్' (Unstoppable 2 With NBK) టాక్ షో ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే. రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో కొత్త ఎపిసోడ్‌ రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్‌ అందించింది ఆహా టీం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొత్త ప్రోమో గురువారం రిలీజైంది.

స్టేజ్‌పైకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన సురేష్‌బాబు, అల్లు అర‌వింద్‌ను (Alluaravind) ఉద్దేశించి మీ ఇద్ద‌రిని చూస్తుంటే ‘భ‌లే దొంగ‌’, ‘మంచి దొంగ’ ఇలాంటి దొంగ సినిమాల‌న్నీ గుర్తొస్తున్నాయి అంటూ పంచ్‌ వేసి బాల‌కృష్ణ (Balakrishna) న‌వ్వించాడు. ఈ క్రమంలోనే హోస్ట్ బాలయ్య మాట్లాడుతూ.. ‘మన కాంబినేషన్ ఎప్పుడు?’ అని అల్లు అరవింద్ అని అడిగారు. ‘మీరు, చిరంజీవితో కలిపి కాంబినేషన్ లో తీద్దామని వెయిట్ చేస్తున్నాను’ అని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. దీంతో అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని బాలయ్య.. ఇంకాస్త హైప్ పెంచేశారు.

ఆ త‌ర్వాత షోలోకి రాఘ‌వేంద్ర‌రావు (Director Raghavendra Rao) ఎంట్రీ ఇచ్చాడు. సురేష్‌బాబు, అల్లు అర‌వింద్ మ‌ధ్య‌లో కూర్చోవాల్సిరాగా జీవితం అంతా న‌ల‌భై ఏళ్ల నుంచి ఇద్ద‌రి మ‌ధ్య‌ శాండ్‌విచ్ అయ్యాన‌ని ఇక్క‌డ కూడా అంతేనా అంటూ రాఘ‌వేంద్ర‌రావు కామెడీని పంచారు. రాఘ‌వేంద్ర‌రావు బీఏ అంటే ‘బొడ్డు మీద ఆపిల్’ అంటూ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి సీక్రెట్ రివీల్ చేశాడు అల్లు అర‌వింద్‌.

తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా.. నిర్మాతలుగా  లెజెండ్స్ అనిపించుకున్న రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సురేశ్ బాబు (SureshBabu), అల్లు అరవింద్ (Allu Aravind) ఈ ఎపిసోడ్ లో తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు. దర్శకులుగా రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి భారీ విజయాలను అందించారు. అప్పట్లోనే కొత్త రికార్డులను నమోదు చేశారు. ఇక నిర్మాతలుగా సురేశ్ బాబు-అల్లు అరవింద్ తెలుగు సినిమాను కొత్త దారుల్లో పరుగులు తీయించారు. 

Read More: టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిన్న కూతురు నందమూరి తేజస్విని (Tejaswini)..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!