Hit 3: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన నాని (Nani)

Updated on Aug 27, 2022 10:54 AM IST
'హిట్ 2' రిలీజ్ కాక ముందే  నాని (Nani) 'హిట్ 3' సినిమా గురించిన వార్త‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
'హిట్ 2' రిలీజ్ కాక ముందే నాని (Nani) 'హిట్ 3' సినిమా గురించిన వార్త‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

టాలీవుడ్ హీరో  నాని (Nani) పాన్ ఇండియా సినిమా 'హిట్ 3'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. తెలుగు సినిమాల‌తో పాటు హిందీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టారు నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2', 'హిట్ 3' సినిమాల‌ను తెర‌కెక్కించ‌నున్నారు. 'హిట్ 2' రిలీజ్ కాక ముందే 'హిట్ 3' సినిమా గురించిన వార్త‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

పాన్ ఇండియా సినిమాగా హిట్ 3

హీరో నాని (Nani) నిర్మాత‌గా 'హిట్' సినిమా తెర‌కెక్కించారు. విశ్వక్ సేన్ హీరోగా రిలీజ్ అయిన 'హిట్' చిత్రంలో నాని నిర్మాత‌గా స‌క్సెస్ సాధించారు. శైలేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'హిట్' సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2' తెర‌కెక్కిస్తున్నారు. 'హిట్ 2'లో అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నారు. 'హిట్ 2' సినిమా ప్ర‌స్తుతం సెట్స్‌పైన ఉంది. 'హిట్ 3' కూడా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా 'హిట్ 3'ను రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాను తెలుగు, హిందీల‌లో నిర్మించాల‌నుకుంటున్నారు. నిర్మాత‌గా, హీరోగా నాని 'హిట్'2' తో హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు. 

Dasara: సింగ‌రేణి గ‌నుల నేప‌థ్యంలో 'ద‌స‌రా' (Nani) చిత్రం  తెర‌కెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 2023 మార్చి 30న రిలీజ్ కానుంది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న 'ద‌స‌రా' చిత్రంలో నాని (Nani)కి జోడిగా హీరోయిన్‌ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  

Read More: Dasara: నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'ద‌స‌రా'కు అంత డిమాండా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!