2022 సెకండాఫ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న టాలీవుడ్ (Tollywood) సినిమాలు.. వెయిటింగ్‌లో ఫ్యాన్స్‌

Updated on Jul 09, 2022 11:04 AM IST
2022 సెకండాఫ్‌లో  టాలీవుడ్‌లో (Tollywood) రిలీజ్ కాబోతున్న సినిమా పోస్టర్లు
2022 సెకండాఫ్‌లో టాలీవుడ్‌లో (Tollywood) రిలీజ్ కాబోతున్న సినిమా పోస్టర్లు

క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల‌పాటు సినీప‌రిశ్ర‌మ గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంది. ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌డంతో వాయిదాప‌డిన సినిమాల‌న్నీ శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మొద‌టి నుంచీ వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఈ ఏడాది సగం(జ‌న‌వ‌రి నుంచి జూన్‌) పూర్త‌యింది. ఈ ఆరు నెల‌ల్లో చిన్నాపెద్ద తేడాలేకుండా థియేట‌ర్లు, ఓటీటీల్లో వంద‌కుపైగా సినిమాలు విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్‌ ఆర్ఆ‌‌ర్‌‌ఆర్‌‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్‌2 సినిమాలు భారీ క‌లెక్ష‌న్ల‌తో రికార్డుల్ని తిర‌గ‌రాశాయి. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన‌ రాధేశ్యామ్‌, ఆచార్య వంటి సినిమాలు కాస్త నిరాశ ప‌రిచినా, స‌ర్కారు వారి పాట‌, మేజ‌ర్‌, విక్ర‌మ్ వంటి సినిమాలు మంచి క‌లెక్షన్లు సాధించాయి.  చిన్న సినిమాలుగా విడుద‌లైన అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం, డీజే టిల్లు వంటి సినిమాలు కూడా హిట్ టాక్‌తో థియేట‌ర్ల‌లో సందడి చేశాయి. ఇక‌, ఈ సంవ‌త్స‌రం సెకండ్ హాఫ్‌లో విడుద‌ల‌య్యేందుకు ప‌లు సినిమాలు సిద్ధ‌మ‌వుతున్నాయి.  రాబోయే ఆరు నెలల్లో విడుద‌ల‌య్యేందుకు తుది మెరుగుల‌ద్దుకుంటున్న‌ సినిమాల‌పై ఓ లుక్కేద్దాం.. 

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ సినిమా పోస్టర్

విజయ్ దేవరకొండ ‘లైగర్’

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. సాధారణంగా మూడు నెలల్లోనే సినిమా తీసి రిలీజ్ చేసే పూరీ లైగర్ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతోపాటు విజయ్ అభిమానులకు కూడా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌‌గా నటిస్తుండడంతోపాటు ప్రపంచ మేటి బాక్సర్‌‌లలో ఒకరైన మైక్ టైసన్‌ కూడా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా, చార్మీ కౌర్ సంయుక్తంగా లైగర్ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

అఖిల్ (Akhil) ఏజెంట్ సినిమా పోస్టర్

అఖిల్.. ‘ఏజెంట్‌’

అక్కినేని అఖిల్ (Akhil)  హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో విజయాన్ని అందుకున్న అఖిల్.. అదే జోష్‌తో ఏజెంట్‌గా రానున్నాడు. అఖిల్‌ సినిమాతో హీరోగా అడుగుపెట్టినప్పటి నుంచి లవర్‌‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌.. ఏజెంట్ సినిమాలో ఫుల్‌ లెంగ్త్ యాక్షన్‌ చేసి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్‌లుక్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడడంతో విడుదల ఆలస్యం అవుతూ వచ్చిన ఏజెంట్‌ సినిమా ఆగస్టు 12వ తేదీన థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించారు.

కార్తికేయ2 సినిమా పోస్టర్

కార్తికేయ 2

సంబరం, హైదరాబాద్ నవాబ్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా.. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నిఖిల్ సిద్దార్ధ్‌. యువత, స్వామి రారా,  కార్తికేయ, అర్జున్ సురవరం, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో టాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ హీరోల జాబితాలోకి చేరిపోయాడు నిఖిల్.

నిఖిల్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 సినిమా తెరకెక్కుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అడివి శేష్ (Adivi Sesh) హిట్‌2 సినిమా పోస్టర్

హిట్ 2

క్రైమ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన సినిమా హిట్‌2. హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించారు. మేజర్ సినిమా సూపర్‌‌ డూపర్ హిట్‌ కావడంతో అడివి శేష్ నటించిన హిట్‌2  సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ తదితరులు నటించిన హిట్‌2 సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. హిట్‌ ఫస్ట్‌ పార్ట్‌లో యువ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించారు. కాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది .హిట్‌2 సినిమాను జూలై 29న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

రవితేజ (Ravi Teja) రామారావు ఆన్ డ్యూటీ ' సినిమా పోస్టర్

రామారావు ఆన్ డ్యూటీ

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja).. ఖిలాడి సినిమా తర్వాత చేస్తున్న సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యాక్షన్‌, థ్రిల్లర్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి చాలాకాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ.. ఎమ్మార్వో ఆఫీసర్‌‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాని (Nani) దసరా సినిమా పోస్టర్

నాని ‘దసరా’

నేచురల్ స్టార్ నాని (Nani) చాలాకాలం తర్వాత ఫుల్‌ లెంగ్త్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ‘దసరా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌‌ ఊర మాస్‌గా ఉంది. చెరుకూరి సుధాకర్‌‌ నిర్మిస్తున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun)

పుష్ప ది రూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప– ది రైజ్. దానికి సీక్వెల్‌గా పుష్ప– ది రూల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్, రష్మికా మందాన హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పుష్ప సినిమా మొదటి పార్ట్‌ 2021, డిసెంబర్ 17వ తేదీన విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. దాంతో ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ 2022 డిసెంబర్‌‌  17వ తేదీన పుష్ప2 సినిమాను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

అక్కినేని నాగార్జున (Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ సినిమా పోస్టర్

అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్‌’

అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాగార్జున ఇంటర్‌‌పోల్‌ ఆఫీసర్‌‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో ‘ది ఘోస్ట్‌’ సినిమా తెరకెక్కుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ విజువల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెల్‌ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న  ‘ది ఘోస్ట్‌’ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

తేజ సజ్జ (Teja Sajja) హనుమాన్ సినిమా పోస్టర్

హనుమాన్

ఇంద్ర సినిమాలో బుల్లి చిరంజీవిగా అలరించి.. జాంబీరెడ్డి సినిమాతో హీరోగా మన ముందుకు వచ్చాడు తేజ సజ్జ (Teja Sajja). ప్రస్తుతం తేజ నటిస్తున్న సినిమా ‘హనుమాన్’ సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రైమ్ షో ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌పై కే నిరంజన్‌రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మిస్తున్నారు.

కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తున్న హనుమాన్ సినిమా రెగ్యులర్‌‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. దాదాపుగా సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా డిజిటల్, శాటిలైట్‌ హక్కుల బిజినెస్ దాదాపు రూ.11కోట్లు అని సమాచారం. కాగా,  హనుమాన్ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. 2022 సెకండాఫ్‌లో (Tollywood)లో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

Read More : Happy Birthday Movie Review: ఊహించినంత ఆనందాన్ని పంచలేకపోయిన లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!