Pushpa 2: 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) వల్లే పుష్ప 2 షూటింగ్ ఆలస్యమవుతోందా.. ఈ వార్తల్లో నిజమెంత?

Updated on Jul 27, 2022 09:26 PM IST
‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు వల్లే పుష-2 (Pushpa 2) సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు వల్లే పుష-2 (Pushpa 2) సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 'పుష్ప 2' ను అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆరు నెలలుగా సినిమా కు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలోనే దర్శకుడు సుకుమార్ (Director Sukumar) ఉన్నాడు.

వాస్తవానికి ‘పుష్ప 2’ (Pushpa 2) ఈ పాటికే సెట్స్‌పై ఉండాలి. అయితే.. సుకుమార్, అల్లు అర్జున్.. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కి రెడీ కాలేదని.. ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘పుష్ప’కి వచ్చిన క్రేజ్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ‘పుష్ప 2’ స్క్రిప్ట్ ని సుకుమార్ రెడీ చేస్తున్నారని.. అందుకే షూటింగ్ ఇంకా మొదలు కాలేదని మరో వాదన వినిపిస్తోంది. 

ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఇప్పుడు ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పుష-2 (Pushpa 2)కథ విషయంలో తుదిమెరుగులు దిద్దుతున్న సుకుమార్ బుచ్చిబాబు రెండో సినిమా కథ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. 

అంతేకాదు పుష్ప-2 (Pushpa-The Rule) సినిమాను వీలైనంత తొందరగా సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకున్న సుకుమార్‌కు బుచ్చిబాబు రెండో సినిమా కథ కాస్త ఇబ్బందిపెడుతుందని సమాచారం. కథ రాసుకోవడానికి అవుట్‌డోర్ వెళ్లినా సుకుమార్‌ను బుచ్చిబాబు వదలడం లేదని.. అందుకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే విషయంలో ఆలస్యమవుతోందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, 'ఉప్పెన' విడుదలై రెండేళ్లు గడుస్తున్నా బుచ్చిబాబు (Director Buchibabu) రెండో సినిమా ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవల బుచ్చిబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి స్టోరీ వినిపించాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ కథలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పాడట. అయితే బుచ్చిబాబు ఈ విషయంలో తన గురువు సుకుమార్ సలహాలు, సూచనలు కోరాడట.

Read More: త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!