‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీరలో కనువిందు చేసిన కృతిశెట్టి (Krithi Shetty)..!

Updated on Sep 14, 2022 06:46 PM IST
తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కృతి శెట్టి (Kriti Shetty) చీరలో కనువిందు చేసింది.
తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కృతి శెట్టి (Kriti Shetty) చీరలో కనువిందు చేసింది.

యంగ్ హీరో సుధీర్ బాబు (Sudhher Babu), 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali). దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) డైరెక్షన్‌లో సుధీర్ బాబు నటిస్తున్న మూడో చిత్రం ఇది.

నాలుగేళ్ళ క్రితం ఇంద్రగంటి-సుధీర్ కాంబినేషన్‌లో మొదటిసారి 'సమ్మోహనం' (Sammohanam) సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి టాక్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

గత రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్‌లో ఒక డైరెక్టర్ ఒకే హీరోతో కలిసి మూడు వరుస సినిమాలు చేయడం.. ఇదే మొదటిసారి కావడం విశేషం. సెప్టెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండడంతో.. మూవీ మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను (Aa Ammayi Gurinchi Meeku Cheppali Pre Release Event) మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు.

చాలామంది ప్రముఖ నటులు, దర్శకులు ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాగచైతన్య (Naga Chaitanya), అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు.. అనిల్ రావిపూడి (Anil Ravipudi), హరీష్ శంకర్, పరశురామ్, వెంకీ కుడుముల, రాహుల్ సాంకృత్యాయన్ వంటి దర్శకులు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కృతి శెట్టి (Kriti Shetty) చీరలో కనువిందు చేసింది. ప్రస్తుతం ఆమె గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఆమె అందాలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. కృతి శెట్టి క్యూట్‌ అందాలు, ఆమె చీర కట్టడంతో హాట్‌గా మారిపోవడం విశేషం. అంతేకాదు.. ఈ ఈవెంట్‌కే కృతి శెట్టి హైలైట్‌గా నిలవడం విశేషం.

Read More: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్ బాబు (Mahesh Babu)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!