Pushpa 2: డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన 'పుష్ప 2'.. త్వరలో షూటింగ్!

Updated on Aug 22, 2022 05:01 PM IST
'పుష్ప 2' పూజా కార్యక్రమం (Pushpa 2 Pooja Ceremony) నేడు జరిగింది. బన్నీ యూఎస్‌ లో ఉండటంతో.. దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా జరిగింది.
'పుష్ప 2' పూజా కార్యక్రమం (Pushpa 2 Pooja Ceremony) నేడు జరిగింది. బన్నీ యూఎస్‌ లో ఉండటంతో.. దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా జరిగింది.

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమా 'పుష్ప' (Pushpa). ఈ సినిమాలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రజానీకం.. ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అయింది. విదేశాల్లో కూడా పుష్ప సాంగ్స్, తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.

ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్‌లో స్వాగ్‌ క్రియేట్‌ చేశాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌ (Director Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని గతంలోనే ప్రకటించారు. 

అయితే.. 'పుష్ప' సినిమా వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా పార్ట్ 2 మొదలుపెట్టలేదని బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమం (Pushpa 2 Pooja Ceremony) ఇవాళ జరిగింది. అల్లు అర్జున్‌ యూఎస్‌ లో ఉండటంతో.. ఈ పూజా కార్యక్రమం దర్శకుడు సుకుమార్‌ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

ఇండియా డే పెరేడ్‌లో పాల్గొన‌డానికి న్యూయార్క్‌కు వెళ్లినందున అల్లు అర్జున్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. అలాగే హీరోయిన్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా ముంబయిలో షూటింగ్స్ తో బిజీగా ఉన్నందున రాలేకపోయింది. దీంతో ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌కు డైరెక్ట‌ర్ సుకుమార్‌, ప్రొడ్యూస‌ర్స్ న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ హాజ‌రై పూజ నిర్వ‌హించారు. కాగా, త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

Read More: Pushpa Movie: “పుష్ప 3” కూడా ఉంటుంది.. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!