Rashmika Mandanna: "కథ విని భయపడిపోయి.. నో చెప్పాను"... 'సీతారామం' ప్రమోషన్లలో రష్మిక మందన్న(Rashmika)!
కోలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salman) టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన వింటేజ్ లవ్‌స్టోరీ 'సీతారామం' . 1964 కాలానికి ప్రస్తుత సమయాన్ని ముడిపెడుతూ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna), తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రలు పోషించారు.
ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సీతారామం (Sitaramam) సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది.
ట్రైలర్ లాంఛ్ (Sitaramam Traielr Launch Event) కార్యక్రమం చిత్రయూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి 'సీతారామం'లోని రష్మిక క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు భయపడిపోయి.. నో చెప్పానని అన్నారు. అయినా ఆమెను వదలకుండా అదే క్యారెక్టర్ చేయించారట డైరెక్టర్.
‘హను (Hanu Raghavapudi) తనకు అఫ్రీన్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ముందు భయం వేసింది, నేను చేయలేనని చెప్పాను. ఇప్పటివరకు నేను బబ్లీ క్యారెక్టర్స్, యాంగ్రీ బర్డ్ క్యారెక్టర్స్ చేశాను. అయితే ఇంత రెబల్‌గా, క్రూరమైన పాత్ర చేస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను. కానీ, పూర్తి కథ, తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, నేను చేయగలను అనే ధైర్యం దర్శకుడు హను ఇవ్వడంతో కొంత హార్డ్ వర్క్ చేసి ఫైనల్‌గా ఓకే చెప్పాను. ఈ సినిమా, అందులోని క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు రష్మిక (Rashmika Mandanna).
Read More: 'సీతారామం' ట్రైలర్ లో అందం, అభినయంతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)