"అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో, లేదో నాకే తెలీదు.." రెజీనా కసాండ్రా (Regina cassandra) షాకింగ్ కామెంట్స్..!

Updated on Sep 10, 2022 03:25 PM IST
2020లోనే ప్రేమ వ్యవహారం ముగిసిందని చెప్పింది రెజీనా (Regina cassandra). దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని కామెంట్ చేసింది.
2020లోనే ప్రేమ వ్యవహారం ముగిసిందని చెప్పింది రెజీనా (Regina cassandra). దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందని కామెంట్ చేసింది.

రెజీనా కసాండ్రా (Regina cassandra).. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో సుధీర్ బాబు సరసన 'శివ మనసులో శృతి' (SMS) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ బ్యూటీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

రెజీనా కసాండ్రా ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లతోనూ బిజీగానే ఉంది. త్వరలో నివేదా థామస్ తో కలిసి 'శాకిని డాకిని' (Saakini Daakini) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది రెజీనా. సౌత్ కొరియా యాక్షన్ కామెడీ మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యాన్లు సంయుక్తంగా నిర్మించాయి. సెప్టెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. 

ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రెజీనా (Regina cassandra) తన వ్యక్తితగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో రెజీనా పెళ్లి గురించి టాపిక్ రాగా ప్రేమ, పెళ్లి అంశాలపై స్పందించింది. ‘‘ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో, లేదో కూడా నాకే తెలీదు. ఎందుకంటే ఎదుటివారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం అనేది చిన్నతనంలోనే అమ్మ నేర్పించింది. జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలను కూడా ఇకపై ఆలోచించే అవకాశం లేదు’’ అని రెజీనా పేర్కొంది.

కాగా, 2020లోనే ప్రేమ వ్యవహారం ముగిసిందని చెప్పింది రెజీనా (Regina cassandra). దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందన్న ఆమె ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఏది ఏమైనా తొలిసారి రెజీనా ఇలాంటి కామెంట్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి. అయితే, ఇప్పటికే 30 ఏళ్ళు దాటిన రెజీనా భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకుంటుందో లేదో అన్నది చూడాలి.

Read More: "మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా" అంటూ రెజీనా (Regina Cassandra) ఫైర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!