Regina Cassandra: పొట్టి డ్రెస్ లో రెజీనా కసాండ్రా.. కొత్త సినిమా షూటింగ్ లో సందడి చేసిన హాట్ బ్యూటీ!

Published on Jul 04, 2022 05:21 PM IST

రెజీనా కసాండ్రా (Regina Cassandra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకుంటూ తన నటనలోని వేరియేషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటున్న రెజీనా ఇటీవల ‘ఆన్యాస్‌ ట్యుటోరియల్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. 
రెజీనా, నివేదిత సతీష్ (Niveditha Satish) ఈ సిరీస్ లో అక్కా చెల్లెల్లు గా నటించారు. సైబర్ టచ్ తో సాగే ఈ సిరీస్ లో హార్రర్ సన్నివేశాలు భయంకరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. హార్రర్ చిత్రాల ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది అని అంటున్నారు. అక్కా చెల్లెళ్ళ మధ్య ఎం జరిగింది? సైబర్ ప్రపంచం లోకి హర్రర్ ఎలా వచ్చింది అనే అంశాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. 

కాగా, ఈ బ్యూటీ 2005 నుంచి చిత్ర పరిశ్రమలో ఉంది. అయితే, ఆమె మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Vhiranjeevi) సరసన ఆచార్య సినిమాలో సానా కష్టం అంటూ సాగే ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఆమె, చిరుపై ఈ స్పెషల్‌ నంబర్‌ను చిత్రీకరించారు.    కాగా, ఇటీవల రెజీనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆచార్య సినిమాలో ప్రత్యేక గీతానికి డ్యాన్స్ చేయడంపై.. చిరంజీవి సినిమా కాబట్టే ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడానికి అంగీకరించానని, ఇకపై ప్రత్యేక గీతాల్లో నటించబోనని తేల్చి చెప్పింది రెజీనా. 

ఇదిలా ఉంటే.. నివేదా థామస్‌తో (Niveda Thomas) కలిసి రెజీనా నటించిన 'శాకినీ డాకినీ ' సినిమా కూడా త్వరలో రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో తన గురించిన విషయాలను రెజీనా కాసాండ్రా మీడియాతో పంచుకుంది. మీరు ఏ డైరెక్టర్‌‌తో పనిచేయాలని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు నేనెప్పుడూ ఈ డైరెక్టర్‌‌తో పనిచేయాలి, ఆ డైరెక్టర్‌‌తో వర్క్‌ చేయాలి అని అనుకోను. కథలో నా క్యారెక్టర్‌‌ను న్యాయం చేయగలనని నన్ను నమ్మి వచ్చిన ఏ డైరెక్టర్‌‌తోనైనా వర్క్‌ చేయడానికి రెడీగా ఉంటాను అని తెలిపింది.