Mareechika: 'మరీచిక'.. అందాల భామలు రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కలయికలో రొమాంటిక్ డ్రామా మూవీ..!

Updated on Jul 15, 2022 02:05 PM IST
 ‘మరీచిక’ పోస్టర్, రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Mareechika Poster, Regina Cassandra, Anupama Parameswaran)
‘మరీచిక’ పోస్టర్, రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Mareechika Poster, Regina Cassandra, Anupama Parameswaran)

టాలీవుడ్ లో అందం, అభినయంతో ఆక‌ట్టుకుంటున్న అందాల భామలు రెజీనా క‌సాండ్ర‌ (Regina Cassandra), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran). వీరిద్దరూ కలిసి ప్రధాన పాత్రల్లో ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మరీచిక’ (Mareechika) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. విజ‌య్ అశ్విన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ‘మ‌రీచిక’ అంటే 'క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ' అని అర్థం. 

కాగా, ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్ర‌తిబింబం నీళ్ల‌లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌కు ‘ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం’ అనేది క్యాప్షన్. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స‌తీష్ కాశెట్టి (Satish Kasetty) ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ మ‌రో ప్రధాన పాత్రలో క‌నిపించ‌నున్నారు. 

‘మరీచిక’ (Mareechika) చిత్రాన్ని వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌పై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ల‌ను అందించడంతో పాటు ల‌క్ష్మీ భూపాల ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై స‌హ నిర్మాత‌గానూ వ్యవ‌హ‌రిస్తున్నారు. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అర‌వింద్ క‌న్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

కాగా, ఇప్ప‌టికే ‘మరీచిక’ (Mareechika) సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. 20 ఏళ్ల పాటు యానిమేష‌న్ రంగంలో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుని నిర్మాత రాజీవ్ చిక్కా ఛోటా భీమ్‌ను రూపొందించారు. ఇప్పుడు 'వ‌న్ మోర్ హీరో' అనే బ్యాన‌ర్‌ను ప్రారంభించారు. 

Read More: Regina Cassandra: పొట్టి డ్రెస్ లో రెజీనా కసాండ్రా.. కొత్త సినిమా షూటింగ్ లో సందడి చేసిన హాట్ బ్యూటీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!