"మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా" అంటూ రెజీనా (Regina Cassandra) ఫైర్ !

Updated on Sep 08, 2022 09:07 PM IST
ప్రెస్ మీట్‌లో భాగంగా ఓ రిపోర్టర్.. "మేడమ్‌ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా?" అని ప్రశ్నించాడు.
ప్రెస్ మీట్‌లో భాగంగా ఓ రిపోర్టర్.. "మేడమ్‌ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా?" అని ప్రశ్నించాడు.

టాలీవుడ్ కథనాయికలు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్‌ ప్రధాన పాత్రలలో కొరియన్ పిక్చర్ 'మిడ్‌నైట్ రన్నర్స్' సినిమాకి రీమేక్‌గా రూపొందిన సినిమా "శాకిని డాకిని". సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మించారు. 

"శాకిని డాకిని" (Shakini Dakini) మూవీని సెప్టెంబరు 16న రిలీజ్ చేయబోతున్నారు చిత్ర నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రెజీనా షాకయింది. 

ప్రెస్ మీట్‌లో భాగంగా ఓ రిపోర్టర్.. "మేడమ్‌ మీకు ఈ సినిమాలో ఓసీడీ ఉన్నట్లు చూపించారు. నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా?" అని ప్రశ్నించాడు. దాంతో రెజీనా (Regina Cassandra) ఆ రిపోర్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రెస్ మీట్‌లో  రెజీనా కసాండ్రా (Regina Cassandra)

"మీరు అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో కేవలం నటిస్తామంతే. పాత్ర డిమాండ్‌ చేయడం వల్ల మేము అలా నటిస్తాము. అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ, ఈ సినిమాని తీస్తే "మీరేమో నా పాత్ర, ఓసీడీ" గురించి అడుగుతున్నారు. ఓసీడీ లాంటి సైకలాజికల్‌ డిజార్డర్‌ నాకేమీ లేదు. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉంటాయా" అంటూ ఫైర్ అయింది. దీంతో ప్రస్తుతం రెజీనా (Regina Cassandra Comments Viral) కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

కాగా, రెజీనా కసాండ్రా.. టాలీవుడ్ లో 'శివ మనసులో శృతి' (SMS) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రెజీనా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో కలిసి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. 

అయితే.. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. 

అయితే రెజీనా కసాండ్రా (Regina Cassandra) ఈ మధ్యకాలంలో సినిమాలలో కనిపించడం మానేసింది. కానీ, సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది.

Read More: వైట్ డ్రెస్ లో అందాల ప్రదర్శన చేస్తూ అదరగొట్టిన 'ఆచార్య' ఐటమ్ బ్యూటీ రెజీనా కసాండ్ర (Regina Cassandra)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!