వెస్ట్రన్ స్టైల్ లో శ్రుతి హాసన్ (Shruti Haasan) తాజా ఆల్బమ్.. అదరిపోయిన 'షీ ఈజ్ ఏ హీరో' (She Is A Hero)..!

Updated on Sep 10, 2022 04:55 PM IST
వెస్ట్రన్ స్టైల్ లో 'షీ ఈజ్ ఏ హీరో' (She Is A Hero Album Song) అనే వీడియో ఆల్బమ్ రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. 
వెస్ట్రన్ స్టైల్ లో 'షీ ఈజ్ ఏ హీరో' (She Is A Hero Album Song) అనే వీడియో ఆల్బమ్ రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. 

శ్రుతి హాసన్ (Shruti Haasan) మంచి నటి మాత్రమే కాదు గాయని కూడా అన్న సంగతి తెలిసిందే. ఓ వైపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన మ్యూజిక్ కోసం తప్పకుండా సమయం కేటాయిస్తూ ఉంటుంది శ్రుతి హాసన్. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్, సింగర్‌గా తనని తాను ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటుంది.

శ్రుతి హాసన్ ఇప్పటికే పలు ప్రత్యేక వీడియో సాంగ్స్ ని విడుదల చేసింది. సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం. కరోనా వల్ల రెండేళ్లు పాటలకు, మ్యూజిక్‌కు దూరంగా ఉన్న శ్రుతి.. తాజాగా ఓ సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేసింది. వెస్ట్రన్ స్టైల్ లో 'షీ ఈజ్ ఏ హీరో' (She Is A Hero Album Song) అనే వీడియో ఆల్బమ్ రూపొందించింది ఈ ముద్దుగుమ్మ. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతూ దుమ్ము రేపుతోంది. 

“షీ ఈజ్ ఏ హీరో” (She Is A Hero Album Song) అంటూ సాగే ఈ పాటను శ్రుతి స్వయంగా ఆలపించింది. పురుషహంకార సమాజంలో తమను తాము రక్షించుకుంటూ.. తమ హక్కుల కోసం పోరాడుతూ.. రోజురోజుకు మరింత స్ట్రాంగ్‌గా నిరూపించుకుంటున్న మహిళలకు తన పాటని డెడికేట్ చేస్తున్నట్లు శ్రుతి చెప్పింది. మహిళగా ప్రస్తుతంతో పాటు గతాన్ని, భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుంటానని అన్నది. ‘ఈ పాటకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పాట నచ్చితే నేను నటిస్తున్న సినిమాల్లో కూడా పాడతాను’ అని చెప్పింది శ్రుతి. 

శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా నటించిన 'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రానికి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. అలా హిందీ, తెలుగు, తమిళం మొదలగు భాషల్లో కథానాయికగా నటిస్తూ ఇప్పుడు అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ 'సలార్'తో పాటు చిరంజీవి 154, బాలకృష్ణ 107వ సినిమాల్లో నటిస్తోంది.

Read More: Shruti Haasan: 'ప్రశాంత్ నీల్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు'.. సలార్ హీరో, దర్శకుడిపై శృతి హాసన్ వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!