Chiranjeevi: 'మెగా154' (Mega 154) నుంచి క్రేజీ అప్‌డేట్‌.. నేటి నుంచి డబ్బింగ్ ప్రారంభం.. దీపావళికి టీజర్?

Updated on Oct 15, 2022 03:43 PM IST
‘మెగా 154’ (Mega 154) చిత్రం డబ్బింగ్ ని ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్టు తెలిపింది చిత్ర యూనిట్.
‘మెగా 154’ (Mega 154) చిత్రం డబ్బింగ్ ని ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్టు తెలిపింది చిత్ర యూనిట్.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమాతో ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ చిత్రం ఇంకా సక్సెస్ మీట్ లను జరుపుకుంటోంది. ఓ వైపు సక్సెస్ మీట్ లు జరుగుతుండగానే.. మరోవైపు చిరంజీవి ‘మెగా 154’పై (వర్కింగ్ టైటిల్) కూడా ఫోకస్ పెట్టారు. ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

‘మెగా 154’ (Mega 154) పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంతో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంటున్న యూనిట్ సినిమా నిర్మాణంలో తాజాగా మరో మెట్టు ఎక్కింది. ఈ మేరకు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. 

‘మెగా 154’ (Mega 154) చిత్రం డబ్బింగ్ ని ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్టు తెలిపింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి అధికారికంగా కొన్ని ఫోటోలు విడుదల చేశారు. దీపావళి కానుకగా సాలిడ్ అప్డేట్స్ సిద్ధంగా ఉండగా మేకర్స్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ సినిమాలో 'గ్యాంగ్ లీడర్', 'ముఠా మేస్త్రి' రకం పాత్రలలో కనిపించబోతున్నట్లు, ఈ సినిమా పూర్తి ఎంటర్టైనర్ జోనర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దీపావళి కానుకగా.. ఈ చిత్రం టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇక, ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు టీజర్ ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ బ్రహ్మండమైన విజయం సాధించడంతో తదుపరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veeraiah)పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Read More: Mega 154: 'మెగా 154' ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?... చిరంజీవి (Chiranjeevi) సినిమాలో ఆ హీరోలు న‌టిస్తే ఇక జాత‌రే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!