రేణూ దేశాయ్ (Renu Desai) రీ ఎంట్రీ అదిరిపోయిందిగా.. 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger NageswaraRao) నుంచి ప్రీ లుక్

Updated on Sep 29, 2022 09:39 PM IST
18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ (Renu Desai) పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ప్రీ లుక్ వీడియోలో వెల్లడించారు.
18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ (Renu Desai) పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ప్రీ లుక్ వీడియోలో వెల్లడించారు.

టాలీవుడ్ మాస్ మహారాజ (Ravi Teja) రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ 'టైగర్‌ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao). ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్ సోద‌రి నుపుర్ స‌న‌న్ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో గాయ‌త్రి భ‌రద్వాజ్ న‌టిస్తోంది. 

1970లో స్టూవర్టుపురంలోని 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao) అనే ఒక దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వంశీ. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై పరిశ్రమలో భారీగా అంచనాలున్నాయి. 

ఇదిలా ఉంటే.. 'టైగర్‌ నాగేశ్వర రావు' సినిమా నుంచి గురువారం చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్‌డేట్‌ విడుదల చేసింది. ఈ సినిమా నుండి రేణూ దేశాయ్ ప్రీ లుక్ విడుదల చేశారు. 18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ (Renu Desai) పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ప్రీ లుక్ వీడియోలో వెల్లడించారు. ఇక, ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక ఈ మూవీలో రేణూ దేశాయ్ పేరు 'హేమలత లవణం' (Hemalatha Lavanam video) అని తెలుస్తోంది. తాజాగా మేకర్స్ ఈ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ వీడియో ను విడుద‌ల చేయ‌గా.. నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇందులో ఓ తెల్ల చీర కట్టుకొని మరో ఇద్దరితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రేణుని చూపించారు. 

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'బద్రీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఆ చిత్రం ద్వారానే పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడిపోయారు. వీరిద్దరూ ప్రేమలో ఉండగానే 2003లో పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'జానీ' చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అదే రేణూ దేశాయ్ చివరి చిత్రం కావడం విశేషం. ఇక, ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, విడాకులు ఇలా రేణూ దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.

Read More: Raviteja: రవితేజ 'ధమాకా' (Dhamaka) మూవీ నుంచి 'మాస్ రాజా' (Mass Raja) లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!