‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ సీజన్‌ 2పై ఆహా (Aha) క్లారిటీ.. గెస్ట్‌లు ఎవరో కామెంట్‌ చేయాలని ట్వీట్

Updated on Jun 20, 2022 06:47 PM IST
అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే
అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే

నందమూరి బాలకృష్ణ ఫస్ట్‌ టైమ్‌ హోస్ట్‌గా వ్యవహరించిన టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. ఈ షో ఎంత సక్సెస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా (Aha) నిర్వహించిన ఈ షోకి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షో తొలి సీజన్‌ను విజయంతంగా పూర్తి చేశారు. తన షోకు వచ్చిన అతిథులందరితో కలిసిపోతూ సరదా సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు.

తన మాటలు, ఆటలు, చలోక్తులతో ఆడియన్స్‌ను అలరించడమే కాకుండా ఆశ్యర్యపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు కూడా. మోహన్‌బాబు గెస్ట్‌గా వచ్చిన షోతో స్టార్ట్ అయిన అన్‌స్టాపబుల్‌ షో.. చివరి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు వచ్చారు.

బాలయ్య సందడితో సీజన్‌1 పూర్తయింది. అయితే అన్‌స్టాపబుల్‌ సీజన్‌2 ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సీజన్‌2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికే సీజన్‌2 ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు దీనిపై ఆహా కూడా క్లారిటీ ఇచ్చింది.   

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే

ఇటీవల తెలుగు ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ 6 ఎపిసోడ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హోస్ట్‌ శ్రీరామ చంద్ర బాలయ్యను అన్‌స్టాబుల్‌ సీజన్‌ 2 ఎప్పుడు సార్‌? అని ప్రశ్నించాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే ఇదే వీడియోను ఆహా వీడియోస్‌ షేర్‌ చేస్తూ ‘త్వరలోనే అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో మళ్లీ మీ ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 నుంచి ప్రోమో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.

ఈసారి ఎవరెవరు గెస్ట్‌గా రావాలనుకుంటున్నారో కామెంట్స్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేసింది ఆహా(Aha). ఈ ట్వీట్‌తో డిజిటల్‌ ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌ రాబోతోందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌గా ఎవరెవరు రావాలో చెబుతూ తమ తమ అభిమాన హీరోల పేర్లను కామెంట్‌లో పేర్కొంటున్నారు నెటిజన్లు. 

Read More : Telugu Indian Idol : ఒకే రియాలిటీ షోలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇది ఎలా సాధ్యమైంది?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!